● ఎదురుచూపులకు తెర ● 14వేలకు పైగా కొత్త కార్డులు ● కొత్త కోడళ్లు.. పిల్లలకు కార్డుల్లో చోటు ● సెప్టెంబర్ నుంచి బియ్యం పంపిణీ
బోయినపల్లి(చొప్పదండి): ఎదురుచూపులకు తెరపడింది. పెళ్లయి, సంతానం కలిగినా రేషన్‌కార్డులు రాకపోవడంతో ఆందోళన చెందిన వారి మనసులు ఉప్పొంగుతున్నాయి. కొత్త రేషన్‌కార్డులను ప్రభుత్వం మంజూరు చేయడంతో పేదల ఎదురుచూపులు ఫలించాయి. జిల్లాకు కొత్తగా 14,075 రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. మరో 30,376 మందిని రేషన్‌కార్డుల్లో కొత్తగా నమోదు చేశారు. సెప్టెంబర్ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్తగా 14వేల రేషన్‌కార్డులు
జిల్లాలోని 13 మండలాల్లో ఇప్పటి వరకు 1,74,304 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటి కింద ప్రతీ నెల సుమారు 3,300 టన్నుల బియ్యం సరఫరా అవుతుంది. జిల్లాలో కొత్తగా 14,075 రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. మరో 30,376 మంది పేర్ల ను ఇప్పటికే ఉన్న కార్డుల్లో నమోదు చేశారు. కొత్తకార్డులు మంజూరుకావడంతో జిల్లాలో అదనంగా 200 టన్నుల బియ్యం సరఫరా కానున్నాయి.
కొత్త కోడళ్లకు.. పిల్లలకు చాన్స్
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2021లో ఒకసారి రేషన్‌కార్డులు మంజూరు చేశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కొత్తకార్డులు వచ్చాయి. ఇటీవల చాలా గ్రామాల్లో ఎంతో మంది కొత్తగా వివాహం చేసుకున్నారు. కొత్త కోడళ్ల పేర్లు రేషన్‌కార్డుల్లో లేక బియ్యం, సరుకులు రావడం లేదు. అలాగే కొత్తగా జన్మించిన పిల్లల పేర్లు నమోదు కావడం లేదు. ఇప్పుడు కొత్తకార్డులు మెజార్టీగా కొత్త కోడళ్లకే మంజూరయ్యాయి.
రేషన్‌కార్డుల వివరాలు
మండలం పాతకార్డులు కొత్తకార్డులు
బోయినపల్లి 11,911 1,070
చందుర్తి 10,932 818
ఇల్లంతకుంట 15,628 887
గంభీరావుపేట 14,472 947
కోనరావుపేట 13,814 889
ముస్తాబాద్ 14,518 1,499
రుద్రంగి 4,845 88
సిరిసిల్ల 26,784 2,610
తంగళ్లపల్లి 14,346 1,407
వీర్నపల్లి 4,229 329
వేములవాడ 19,393 1,405
వేములవాడరూరల్ 7,509 632
ఎల్లారెడ్డిపేట 15,823 1,494
రేషన్‌కార్డుల సమాచారం
ఇప్పటి వరకు ఉన్న కార్డులు 1,74,304
పాతకార్డుల్లో ఉన్న సభ్యులు 5,22,967
పాతకార్డుల ద్వారా వచ్చే బియ్యం
3,300 టన్నులు
కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులు 14,075
కొత్తగా రానున్న బియ్యం 200 టన్నులు