
నేరాల విచారణలో శాసీ్త్రయ ఆధారాలు కీలకం
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: ఆధునిక ఫోరెన్సిక్, శాసీ్త్రయ ఆధారాలతో నేరాలను సమర్థంగా పరిష్కరించవచ్చని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. సంఘటన స్థలంలో ఆధారాల సేకరణ, భద్రతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా కేసుల దర్యాప్తులో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మెడికల్ కళాశాల వైద్యనిపుణుల ఆధ్వర్యంలో జిల్లాలోని ఇన్వెస్టిగేషన్ అధికారులకు, స్టేషన్ రైటర్లకు శుక్రవారం శిక్షణ ఇచ్చారు. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాల ఘటనల్లో ఏయే ఆధారాలు ఎలా సేకరించాలి అనేదానిపై అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరీ, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, వైద్యులు నిర్వీశ, వినయ్, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్‌ఐలు యాదగిరి, మధుకర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.