
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేశారు. నేరెళ్ల, జిల్లెల్ల, మండెపల్లి గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో సైకిళ్లు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు తుపాకుల సత్తయ్య, మండల ప్రధాన కార్యదర్శులు ఇటికల రాజు, కోస్నీ వినయ్ యాదవ్, ఉపాధ్యక్షుడు రెడ్డిమల్ల ఆశీర్వాద్, కాసుగంటి రాజు, బూత్ అధ్యక్షుడు రేగుల రాజు, నాగుల శ్రీనివాస్, కట్కం మధుసూదన్, కట్ట తిరుపతి, ఆసాని లక్ష్మారెడ్డి, బక్కశెట్టి రాజు, ముత్యం యాదవ్, బోయినీ రాజు, సందీప్, దూడం నవీన్, ఇంద్రనగర్ సంతోష్, గంధం రాజు, పొన్నం అనిల్, దాసరి రమేశ్ పాల్గొన్నారు.