
రాజన్న సేవలో ఎస్పీ
వేములవాడ: రాజన్నను ఎస్పీ మహేశ్ బి గీతే గురువారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఎస్పీకి వేదమంత్రాలతో స్వాగతం పలికారు. కళ్యాణ మండపంలో వేదోక్త ఆశీర్వచనాలు, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ లడ్డూ ప్రసాదం అందజేశారు. టౌన్ సీఐ వీరప్రసాద్ ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలోని ప్రధాన రహదారుల్లోని జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్లే దారిలో వేములవాడ మండలం నాంపల్లి, రుద్రవరం, ఆరెపల్లి, బోయినపల్లి మండలం కొదురుపాక, వెంకట్రావుపల్లి వరకు ప్రమాదాలు జరిగే స్పాట్లను గురువారం పరిశీలించారు. ప్రమాదాలు జరిగే రోడ్డు పరిసరాల్లో రంబుల్ స్ట్రిప్, స్టడ్స్‌లైట్స్, సోలార్ లైట్లు, అజార్డ్ మార్కర్స్ అమర్చేందుకు స్థలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, జిల్లా రవాణాశాఖ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ట్రాఫిక్ ఎస్సై రాజు, ఆర్‌అండ్‌బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఏఈఈ నవ్య తదితరులు ఉన్నారు.
రేపు జావలిన్ డే పోటీలు
సిరిసిల్లటౌన్: నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ఆగస్టు 2న జావెలిన్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కర్యాదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. అండర్ 8, 10, 12, 14, 16, 18, 20 మెన్ అండ్ ఉమెన్స్‌కు జావెలిన్, పరుగుపందేల ఎంపిక పోటీలు శనివారం సిరిసిల్ల జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని ఆగస్టు 7న జనగాంలో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తహసీల్దార్ జారిచేసిన డేట్ ఆఫ్ బర్త్, పదో తరగతి సర్టిఫికెట్లు ఒరిజినల్, జిరాక్స్‌లతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 79014 64456, 94414 56385, 93928 80231లలో సంప్రదించాలని కోరారు.
ఉద్యోగుల సేవలు గుర్తుండిపోతాయి
వేములవాడ: ఉద్యోగులు చేసిన సేవలు గుర్తిండిపోతాయని ఈవో రాధాభాయి పేర్కొన్నా రు. రాజన్న ఆలయంలో సహాయక ఇంజినీర్(సివిల్)గా పనిచేసిన ఆర్.లక్ష్మణ్‌రావు, ఇటీవల బదిలీపై వచ్చిన జి.లక్ష్మణ్ గురువారం ఉద్యోగ విరమణ పొందారు. వారిని ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి ఈవో రాధాభాయి సన్మానించారు. యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్ పాల్గొన్నారు.
చక్కగా చదివి.. గొప్పగా ఎదగాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చక్కగా చదివి గొప్పగా ఎదగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆకాంక్షించారు. మండలంలోని ఓబు లాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులు 24 మందికి మోదీ గిఫ్ట్ పేరుతో గురువారం సైకిళ్లు పంపిణీ చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, హెచ్‌ఎం బండి ఉపేందర్, నాయకులు సందెవేని రాజు, రాగుల లక్ష్మణ్‌రెడ్డి, ఆసాని రాంలింగారెడ్డి, సిరిసిల్ల వంశీ, కాసుగంటి రాజు, పంచాయతీ కార్యదర్శి రఘువీరారెడ్డి పాల్గొన్నారు.

రాజన్న సేవలో ఎస్పీ

రాజన్న సేవలో ఎస్పీ

రాజన్న సేవలో ఎస్పీ