
రోడ్డు ఎప్పుడు వేస్తారో..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సీసీ రోడ్డు నిర్మాణానికి నాలుగు నెలల క్రితం శంకుస్థాపన చేసి మరిచిపోయారంటూ ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గరాజేశ్వరతండావాసులు గురువారం నిరసన తెలిపారు. తండాపరిధిలోని టీక్యాకాలనీలో 11 కుటుంబాలు నివసిస్తున్నాయి. తండాకు వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. దీనికితోడు ఈమార్గంలోనే ఒర్రె ఉండడంతో వారి తిప్పలు చెప్పుకోలేనివిగా ఉన్నాయి. ఇటీవల రూ.5లక్షలతో 100 మీటర్ల రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేసినా నాయకులు పనులు మాత్రం చే యడం లేదు. దీంతో తండావాసులు నిరసనకు దిగారు. ఇప్పటికైనా రోడ్డు వేయాలని కోరుతున్నారు.