గాయపడ్డ ఆశకార్యకర్తలకు పరామర్శ
ఇల్లంతకుంట(మానకొండూర్): లెప్రసీ సర్వే విధులు ముగించుకొని ఆటోలో ఇంటికొస్తుండగా ప్రమాదబారిన పడ్డ ముగ్గురు ఆశ కార్యకర్తలను వైద్యాధికారులు ఆదివారం పరామర్శించారు. రహీంఖాన్‌పేట హెల్త్ సబ్‌సెంటర్ పరిధిలోని ఆశకార్యకర్తలు మచ్చ పద్మ, బట్టి తార, దొంతి ఎల్లవ్వ వెల్జీపురంలో లెప్రసీ సర్వే కోసం శనివారం వెళ్లి తిరిగి వస్తుండగా ఎర్రనర్సుపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. చేయి విరిగి ఇంటి వద్దనే ఉన్న మచ్చ పద్మను, దొంతి ఎల్లవ్వను, బట్టి తారలను స్థానిక వైద్యాధికారి జీవనజ్యోతి, హెచ్‌ఈవో వెంకటరమణ, సూపర్‌వైజర్ శోభ, ఏఎన్‌ఎం స్వరూప పరామర్శించారు.
కురుమ హాస్టల్‌కు స్థలం కేటాయించాలి
బోయినపల్లి(చొప్పదండి): జిల్లా కేంద్రంలో కురుమ హాస్టల్, కురుమసంఘం భవనాల నిర్మాణాలకు ఐదెకరాలు కేటాయించాలని జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, నాయకులు సంబ లక్ష్మీరాజం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నవించారు. కురుమ, గొల్ల సామాజికవర్గాలు ఒకటి కాదని నిర్ధారణ చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు.
పాస్టర్ ప్రవీణ్‌ను హత్య చేసిన వారిని శిక్షించాలి
సిరిసిల్ల: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో హత్యకు గురైన పాస్టర్ పగడాల ప్రవీణ్ హంతకులను శిక్షించాలని కోరుతూ సిరిసిల్లలో పాస్టర్లు ఆదివారం ర్యాలీ తీశారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. మాలమహానాడు రాష్ట్ర నాయకుడు రాగుల రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, పాస్టర్లు మనోహర్, గోవర్ధన్, మోసే, శ్యామ్యూల్, ఏసుదాసు, ప్రేమ్ పాల్గొన్నారు.
గాయపడ్డ ఆశకార్యకర్తలకు పరామర్శ
గాయపడ్డ ఆశకార్యకర్తలకు పరామర్శ


