క్రీడలకు ప్రోత్సాహం
● సీఎం కప్ పోటీలతో ప్రతిభకు గుర్తింపు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: విద్యార్థి దశ నుంచే క్రీడలను సీఎం రేవంత్‌రెడ్డి, ప్రజా ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం సీఎం కప్ పోటీల ప్రారంభం సందర్భంగా జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో టార్చ్ ర్యాలీని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ప్రారంభించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కప్ పేరిట గ్రామ స్థాయి నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యు వతకు ఉద్యోగాలు ఇస్తుందని, యువత, విద్యార్థులకు ఉపాధి కల్పించే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా యువత ఎక్కువ పతకాలు సాధించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆకాంక్షించారు. జిల్లాలో 34 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో ఈ నెల 17 నుంచి 22, మండల, మున్సిపాలిటీ, జోనల్ స్థాయిలో ఈనెల 28 నుంచి 31 వరకు, నియోజకవర్గస్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 5, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 9 నుంచి 12, రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ అధ్యక్షుడు నాగు ల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ నేత మహేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మార్కె ట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపరెడ్డి, యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌ జన్య, కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ప్రకాశ్, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, కాముని వనిత, గోలి వెంకటరమణ, భైరినేని రాము పాల్గొన్నారు. సిరిసిల్ల అంబేడ్కర్‌చౌక్ నుంచి నేతన్న విగ్రహం వరకు క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు.
పల్లెల నుంచి ప్రపంచస్థాయికి ఎదగాలి
ముస్తాబాద్/బోయినపల్లి/రుద్రంగి: పల్లెల్లోని యువత ప్రపంచస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా క్రీడాధికారి రాందాస్ కోరారు. ముస్తాబాద్, బోయినపల్లి, రుద్రంగి మండల కేంద్రాల్లో సీఎం కప్ టార్చిరిలే నిర్వహించారు. రాందాస్ మాట్లాడుతూ యువతలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు సీఎం కప్ క్రీడాపోటీలు ఉపయోగపడతాయన్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, ఎస్సై గణేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, సర్పంచ్‌లు చిగురు నరేశ్, మెంగని శ్రీనివాస్, నక్కదాసరి రవి, ఎంపీడీవోలు లచ్చాలు, జయశీల, ఎంపీవో వాహిద్, ఎంఈవో శ్రావణ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్‌యాదవ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి పాల్గొన్నారు.
వీటీఏడీఏ పనుల్లో వేగం పెంచాలి
వేములవాడ: వీటీఏడీఏ పనుల్లో వేగం పెంచాలని, శివరాత్రి జాతరలోగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. స్థానిక కోరుట్ల బస్టాండ్ నుంచి చెక్కపల్లి చౌరస్తా మార్గంలోని పనులను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన నాణ్యతతో పనులు చేయాలన్నారు. మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గుడి చెరువును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. విగ్రహాలు, విద్యుత్ దీపాలు, మొక్కలు, ఫౌంటేయిన్‌ను పరిశీలించారు. నాంపల్లి గుట్టపై త్వరలోనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్డీవో రాధాభాయి, పబ్లిక్ హెల్త్ డీఈ వరుణ్, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, టీపీవో అన్సార్, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య పాల్గొన్నారు.


