పిల్లలకు టీకాలు వేయాలి
సిరిసిల్ల: ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు. పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో నిల్వ ఉండే వ్యాక్సిన్‌లను పరిశీలించి మాట్లాడారు. అసంక్రమిత వ్యాధులైన(ఎన్‌సీడీ) రక్తపోటు, డయాబెటీస్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటిక్యాన్సర్ పరీక్షలు చేసి విధిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని వైద్యాధికారులతో మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు రామకృష్ణ, సంపత్‌కుమార్, అనిత, డీడీఎం, సీహెచ్‌వోలు పాల్గొన్నారు.
జిల్లాను రద్దు చేస్తే ఆమరణ దీక్ష
సిరిసిల్లటౌన్: జిల్లాను రద్దు చేస్తే ఆమరణ దీక్షకు సిద్ధమని జిల్లా ఉద్యమకారుడు మారవేని రంజిత్‌కుమార్ హెచ్చరించారు. సిరిసిల్లలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఏర్పాటైతేనే ఈ మాత్రం అభివృద్ధి సాధ్యమైందన్నారు. జిల్లాను ఎత్తివేస్తే కాంగ్రెస్ పార్టీని తరిమికొడతామన్నారు. జిల్లా ఉద్యమానికి మద్దతు తెలిపిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎలా రద్దు చేయాలని కుట్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. జిల్లాను రద్దు చేస్తే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జిల్లా ఉద్యమకారులు సామనపల్లి ప్రశాంత్, అక్కెం నాగరాజు, గొండ్లే తిరుపతి, టేకు మధు, హనుమాన్ పాల్గొన్నారు.
పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలి
సిరిసిల్ల అర్బన్: ప్రతీ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని రవాణా శాఖ సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి పృథ్వీరాజ్‌వర్మ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురష్కరించుకొని శ నివారం జిల్లాలో వాహన తనిఖీలు చేపట్టారు.
ధర్నాను విజయవంతం చేయండి
సిరిసిల్ల అర్బన్: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ నేతన్నల కోసం చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. సిరిసిల్లలోని తెలంగాణభవన్‌లో శనివారం మాట్లాడారు. నేతన్నలకు యార్న్ సబ్సిడీలో జాప్యం, త్రిఫ్ట్ నిధుల నిలిపివేత, వర్కర్ టు ఓనర్ పథకంపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ధర్నా తేదీని త్వరలోనే కేటీఆర్ వెల్లడిస్తారని తెలిపారు. టెస్కాబ్ మాజీ చైర్మన్ రవీందర్‌రావు, నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, వెంగళ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇంటివద్దకే మేడారం ప్రసాదం
విద్యానగర్(కరీంనగర్): మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే సమ్మక్క సారలమ్మలు ఉన్న ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ప్రసాదం అందజేయనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఏటీఎం లాజిస్టిక్స్ బాధ్యులు వెంకటనారాయణ, ఆర్‌ఎం ఎ.రాజు శనివారం తెలిపారు. ఈనెల 31 వరకు www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకుంటే, ప్రసాదం ప్యాకెట్ ఇంటికి తెచ్చి ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9154298581, 9154298561, 9154298559 నంబర్లల్లో సంప్రదించాలని సూచించారు.
21 నుంచి సదరం శిబిరం
సిరిసిల్లకల్చరల్: దివ్యాంగుల వైకల్య నిర్ధారణ పరీక్షల సదరం శిబిరం ఈనెల 23 నుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధానాస్పత్రి పర్యవేక్షకుడు ప్రవీణ్‌కుమార్ శనివారం తెలిపారు. 21న మానసిక, వినికిడి, 22న జనరల్, 28న ఆర్థో, 29న కంటిచూపునకు సంబంధించిన పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులు తమ మెడికల్ డాక్యుమెంట్లు, దరఖాస్తు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఫోన్‌నంబర్‌తో నిర్ధేశిత తేదీల్లో శిబిరానికి హాజరుకావాలని సూచించారు.
పిల్లలకు టీకాలు వేయాలి
పిల్లలకు టీకాలు వేయాలి
పిల్లలకు టీకాలు వేయాలి


