భక్తుల కొంగుబంగారం.. బుగ్గరాజేశ్వరస్వామి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అక్కపల్లి శివారులోని బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం జాతరకు ముస్తాబైంది. సిరిసిల్ల డిపో నుంచి మండల కేంద్రం మీదుగా అక్కపల్లి ఆలయం వరకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు చేపడుతున్నారు. ఆలయ పరిసరాలను సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై రాహుల్‌రెడ్డి శనివారం పరిశీలించారు. మండలంలోని రాచర్ల గొల్లపల్లి, రాచ ర్ల బొప్పాపూర్, నారాయణపూర్, అల్మాస్‌పూర్, వెంకటాపూర్, పదిర గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.


