● సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
వేములవాడఅర్బన్/రుద్రంగి(వేములవాడ): మహిళలను కోటీశ్వరులు చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వేములవాడరూరల్ మండల పరిధిలో రూ.9లక్షలు విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్ 23చెక్కులు, అర్బన్ మండలానికి రూ.5.50 లక్షల విలువ చేసే 26 చెక్కులు పంపిణీ చేశారు. రుద్రంగి రైతువేదికలో 35మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. బడ్జెట్‌లో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మర్రిపల్లి రిజర్వాయర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. 42శాతం రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. పుట్టినగడ్డ రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఇప్పటివరకు రుద్రంగి మండల పరిధిలో అనేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని పేర్కొన్నారు. వేములవాడలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్లు విజయ ప్రకాశ్‌రావు, ఎండీ అబూబకార్, ఎంపీడీవో రాజీవ్‌మల్హోత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పిల్లి కనుకయ్య, వకుళభరణం శ్రీనివాస్, రుద్రంగిలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీలత, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, గట్ల మీనయ్య, తర్రె మనోహర్ పాల్గొన్నారు.