రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

Mar 20 2025 1:36 AM | Updated on Mar 20 2025 1:36 AM

రెడ్డ

రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

● రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి

సిరిసిల్లటౌన్‌: ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని ఆఫీస్‌లో బుధవారం నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పేదరెడ్డీలను దృష్టిలో పెట్టుకొని రూ.10వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకంలో పేద రెడ్డీలకు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. తీన్మార్‌ మల్లయ్య రెడ్డీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు ఎగుమామిడి కృష్ణారెడ్డి, గుల్లపల్లి నరసింహారెడ్డి, డబ్బు తిరుపతిరెడ్డి, గడ్డమీద ప్రసాద్‌రెడ్డి, కూతురు వెంకట్‌రెడ్డి, లక్కిరెడ్డి కమలాకర్‌ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మడుపు ప్రమోదరెడ్డి, మహిళా సంయుక్త కార్యదర్శి దుండ్ర జలజారెడ్డి, సంయుక్త కార్యదర్శులు ముసుకు తిరుపతిరెడ్డి, ఏమిరెడ్డి కనకారెడ్డి, జువ్వెంతుల లక్ష్మారెడ్డి, మంద బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

న్యాయం చేయండి

సిరిసిల్లటౌన్‌: ఏళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ ప్రజాప్రతినిధి భర్త ఇబ్బందులు పెట్టారని.. ఇప్పుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని సిరిసిల్లకు చెందిన మచ్చ ప్రభాకర్‌ కుటుంబం మున్సిపల్‌ ఎదుట బుధవారం బైటాయించింది. వారు మీడియాతో మాట్లాడారు. నెహ్రూనగర్‌కు చెందిన ప్రభాకర్‌ ఇంటి పక్కనే మాజీ కౌన్సిలర్‌ ఇల్లు ఉంది. తమకు సంబంధించిన స్థలంలో కొంతభాగాన్ని తప్పుడుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. ఈవిషయంలో తమకు న్యాయం కావాలని ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వారితో మున్సిపల్‌ అధికారులు మాట్లాడి ఇంటికి పంపించారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌కు చెందిన కమటం ఉదయ్‌(35) మానేరువాగులోకి చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. ఇంటి నుంచి రెండు రోజుల క్రితం వెళ్లిన వ్యక్తి వాగులో శవమై తేలడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై రమాకాంత్‌ తెలిపిన వివరాలు. ఉదయ్‌ సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈనెల 17న సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రెండు రోజుల నుంచి ఉదయ్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో గాలించారు. ఈక్రమంలోనే బుధవారం మానేరువాగులో శవమై తేలినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ఉదయ్‌గా గుర్తించారు. చేపలు పడుతున్న క్రమంలో అదుపుతప్పి వాగులో పడి నీట మునిగినట్లు భావిస్తున్నారు. మృతుడికి భార్య సరళ, ఇద్దరు కూతుళ్లు అత్విక, అశ్విక ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్‌ తెలిపారు.

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని రామలక్ష్మణపల్లి మానేరువాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై గణేష్‌ తెలిపారు. ముస్తాబాద్‌కు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ బి.సురేశ్‌ను రిమాండ్‌ తరలించామని, ట్రాక్టర్ల యజమానులతోపాటు మరో డ్రైవర్‌పై కేసులు నమోదు చేశామన్నారు.

రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి1
1/2

రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి2
2/2

రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement