మాటలు కలిపి.. బంగారు చైన్‌ అపహరణ | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 10:06 AM | Updated on Feb 26 2023 6:00 AM

వివరాలు వెల్లడిస్తున్న సీఐ ఉపేందర్‌  - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ ఉపేందర్‌

సిరిసిల్లక్రైం: తన స్వగ్రామానికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చున్న వృద్ధురాలితో మాటలు కలిపి తన బైక్‌పై ఊరిలో దిగపెడాతనని తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడి ఆమె మొడలోని రెండు తులాల బంగారు చైన్‌తోపాటు ఇంటిలోని నగదును ఎత్తుకెళ్లాడు ఓ ప్రబుద్ధుడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఉపేందర్‌ వివరాలు వెల్లడించారు.

సిద్దిపేటకు చెందిన అల్లెపు కృష్ణ తొమ్మిదేళ్లుగా దొంగతనాలు చేస్తూ చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఈనెల 23వ తేదీన నేరెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒంటరిగా ఉన్న తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌కు చెందిన ఏనుగు కమలమ్మను గమనించాడు. ఆమెతో మాటలు కలిపి.. వృద్ధురాలి కొడుకు తనకు పరిచయమని నమ్మించాడు. ఇంటి వద్ద దించుతానని తన బైక్‌పై ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లాడు. మాటల్లో పెట్టి పింఛన్‌ పెంచుతానని నమ్మించాడు.

ఆధార్‌కార్డు, బ్యాంకుఖాతా కోసం వృద్ధురాలు ఇంట్లోకి వెళ్లగా.. వెనుకనే వచ్చిన కృష్ణ ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాక్కొన్నాడు. అంతేకాకుండా ఇంట్లో దాచి ఉంచిన రూ.10వేల నగదు తీసుకుని వెళ్తుండగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించి కమలమ్మను నెట్టివేశాడు. అంతేకాకుండా ఎవరితోనైన చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు తంగళ్లపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న కృష్ణ వివరాలు సేకరించి శుక్రవారం బద్దెనపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద పట్టుకొని, రిమాండ్‌కు తరలించారు. దొంగలించిన బంగారు చైన్‌ను ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కుదువపెట్టగా.. దాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement