పచ్చదండు బరితెగిస్తూ! | - | Sakshi
Sakshi News home page

పచ్చదండు బరితెగిస్తూ!

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

దర్శిలో దౌర్జన్యాలకు స్కెచ్‌!

ఖాకీ కొమ్ముకాస్తూ..
రెండో విడత ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలకు టీడీపీ వ్యూహం
దర్శిలో దౌర్జన్యాలకు స్కెచ్‌!

దర్శి నియోజకవర్గంలో మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో నామినేషన్ల అడ్డగింత నుంచి పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ, ఏజెంట్ల బహిష్కరణ వరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసుల సహకారంతో దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అరకొరగా ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో పోలింగ్‌ బూత్‌లను స్వాధీనం చేసుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ నేతలు విమర్శించారు. ఆ చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ఈసారి పంచాయతీ ఎన్నికలు నిస్పాక్షికంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అధికార పార్టీ శ్రేణులు మాత్రం పాత గూండాగిరి పద్ధతులనే మళ్లీ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లు సిద్ధం చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ పరిస్థితులపై వైఎస్సార్‌సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎన్నికల కమిషన్‌, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు వినతిపత్రం అందజేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్ట భద్రత కల్పించాలని కోరారు. కోర్టు సైతం సీసీ కెమెరాలు, భద్రతపై ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement