మాగుంటా..స్థాయికి మించి మాట్లాడొద్దు | - | Sakshi
Sakshi News home page

మాగుంటా..స్థాయికి మించి మాట్లాడొద్దు

Sep 1 2026 3:00 AM | Updated on Sep 1 2026 3:00 AM

బాబు భజన చేయండి కానీ వైఎస్‌ జగన్‌ను అవహేళనగా మాట్లాడితే సహించం సభ్యసమాజానికి మాగుంట క్షమాపణ చెప్పాలి చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం పేదలందరి గడపలకూ సంక్షేమ పథకాల ఘనత జగన్‌దే వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

ఒంగోలు సిటీ: ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కావాలంటే చంద్రబాబు భజన చేయండి.. కానీ మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని అవహేళనగా మాట్లాడితే సహించమని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం బూచేపల్లి మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలో వెలిగొండ పర్యటనకు సీఎం చంద్రబాబుతో పాటు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి వచ్చి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి నానా విధాలుగా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉందన్నారు. ‘‘అయ్యా మాగుంట శ్రీనివాసులరెడ్డి మీ స్థాయి ఏంది, జగన్‌మోహన్‌రెడ్డి స్థాయి ఏంది. స్థాయికి మించి మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మాగుంట శ్రీనివాసులరెడ్డి 2019 నుంచి 2024 వరకు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్నారంటే జగన్‌మోహన్‌రెడ్డి అనుకుంటేనే ఎంపీ అయ్యారు. ఎంపీ సీటు కోసం జగన్‌ చుట్టూ తిరిగింది వాస్తవం కాదా? రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని దైవంగా పూజిస్తున్నారు. కులాలు, మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు పేదలందరి గడప గడపకూ అందాయంటే అది కేవలం జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమే. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రికి ఒక కులంవారుగానీ, ఒక మతంవారు గానీ ఓట్లు వేస్తే సీఎం కారు. అది మాగుంట శ్రీనివాసులరెడ్డి గుర్తించుకోవాలి. రాష్ట్రంలో మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని 2019 నుంచి 2024 వరకు జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకున్నారు. ఒక కులంవారు ఓట్లు వేస్తేనే గెలిచారని, జగన్‌మోహన్‌రెడ్డి మూర్ఖుడని మాట్లాడటం చాలా బాధాకరం. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడం కోసం ఎన్ని కష్టాలు, నష్టాలు, విపత్తులు, కరోనాలు వచ్చినా అన్ని కులాలవారికి, అన్నీ మతాల వారికి సమన్యాయం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి 2024 లో వెలిగొండ ప్రాజెక్టు రెండు టెన్నెళ్లు పూర్తి చేసి వాటిని జాతికి అంకితం చేశారని చెప్పారుకానీ, ఎక్కడా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పలేదు. చంద్రబాబు ప్రసంగంలో కానీ, మీ ప్రసంగంలో కానీ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్‌ చేసి జాతికి అంకితం చేశామన్నారని కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారు. మీకు మా నాయకుడి గురించి మాట్లాడే హక్కు లేదు. ఎవరినీ కించపరిచి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడలేదు. పేదవారందరికీ ఉపయోగపడే పనులు చేశారు. మాకు కనిపించే దేవుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఏ ఆపద వచ్చినా అండగా ఉండే నాయకుడు ఆయన. చంద్రబాబు లాగా వెన్నుపోటు పొడిచే నాయకుడు కాదు. మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి. పబ్లిక్‌ గా జగన్‌మోహన్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలి’’ అని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement