రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు సభకు జనాలతో పాటు పలువురు విద్యార్థులు, ఉద్యోగులను కూడా తరలించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టుగా జీవోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సభకు ప్రభుత్వ జీఓతో సెలవు ప్రకటించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులను ఆదివారం రాత్రే రవాణాశాఖ అధికారులు తమ ఆధీనంలోనికి తీసుకోవడంతో సదరు పాఠశాలలకు చెందిన ప్రిన్సిపల్స్, కరస్పాండెంట్లు సోమవారం సెలవు ప్రకటిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపారు.
జనాల తరలింపునకు వాడిన ప్రైవేటు స్కూల్ బస్సులు


