క్వార్టర్‌పై రూ.40..బీరుపై రూ.70
న్యూస్‌రీల్
అటవీ హక్కులు కల్పించండి
నేటి పాలిసెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా కోఆర్డినేటర్ వలియా నాయక్
నో బీర్...నో బ్రాండెడ్ ..ఓన్లీ చీప్ లిక్కర్.. లైసెన్స్ మద్యం దుకాణాల్లో ఇదీ పరిస్థితి గిద్దలూరులో పచ్చనేత సొంత రాజ్యాంగం సొంత రెస్టారెంట్లో మాత్రమే బ్రాండెడ్ మద్యం విక్రయాలు ఎమ్మార్పీపై అదనంగా రూ.50 నుంచి రూ.300 వరకు వసూళ్లు బీరుపై రూ.70–రూ.100 అదనం సమయపాలన విషయంలోనూ నో టైం నిబంధనలు బేఖాతర్ మత్తు వదలని ఎకై ్సజ్ శాఖ
కళ్లు మూసుకున్న ఎకై ్సజ్ అధికారులు..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరులో పచ్చనేత రాజ్యాంగం అమలులో ఉంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు పనిచేయవు. చట్టం ఉన్నా సారు చుట్టంలా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తోంది. ‘‘తన రెస్టారెంట్‌లో బ్రాండెడ్ మద్యం విక్రయించాలి. లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ మాత్రమే అమ్మాలంటూ హుకుం జారీ చేశారని తెలుస్తోంది. అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని సొంత దందా నడుపుకుంటున్నాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి టాస్క్‌ఫోర్స్:
గిద్దలూరు పట్టణంలో మొత్తం 5 దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ఒంగోలు రోడ్, కుమ్మరి వీధి, నంద్యాల–ఒంగోలు రోడ్ వైఎస్సార్ సర్కిల్, నంద్యాల–ఒంగోలు రోడ్‌లో మరో దుకాణం, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నాయి. వీటికి చాలా మంది మద్యం వ్యాపారులు టెండర్ వేశారు. కొంత మంది లాటరీలో దుకాణాలు దక్కించుకున్నారు. అయితే వారికి ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కీలక నేత సోదరుడు రంగ ప్రవేశం చేసి మద్యం దుకాణాలన్నిటినీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒక ప్లాన్ ప్రకారమే మద్యం దుకాణాలను హస్తగతం చేసుకున్నారు. ఆ దుకాణాల్లో చీప్ లిక్కర్ మాత్రమే విక్రయించే ఏర్పాట్లు చేశారు. బ్రాండెడ్ మద్యం, బీర్లను మాత్రం ఎక్కడా దొరకకుండా కట్టడి చేశారు. ఫలితంగా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల్లో రూ.99 విలువజేసే చీప్ లిక్కర్ మాత్రమే అమ్ముతున్నారు. ఇక్కడ బీరు కానీ, బ్రాండెడ్ కంపెనీ మద్యం కానీ అందుబాటులో లేవు. దీంతో మందుబాబు కొంచెం ఖరీదైన మద్యం కోసం విధిలేని పరిస్థితుల్లో బార్‌కు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. అక్కడ అధిక ధరలు వసూలు చేస్తుండడంతో మద్యం బాబులకు తాగకుండానే నిషా తలకెక్కుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆయన చెప్పిందే టైం...
ఒక్క మద్యం ఎమ్మార్పీ విషయంలోనే కాదు సమయ పాలనలో కూడా అంతా ఆయన ఇష్టమే. రాష్ట్రం మొత్తం ఒక సమయం పాటిస్తే గిద్దలూరులో మాత్రమే ఆ నేత చెప్పిన టైంను పాటిస్తున్నారు అధికారులు. సాధారణంగా మద్యం దుకాణాలన్నీ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాలు నిర్వహించాలి. నిబంధనల ప్రకారం కీలక నేత బార్ కూడా ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండాలి. అయితే తెల్లవారుజాము 6 గంటల నుంచి రాత్రంతా బార్ తెరిచే ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి బార్ అండ్ రెస్టారెంట్‌లో ఏసీ, సౌకర్యవంతమైన సిట్టింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ అలాంటి సౌకర్యాలు మచ్చుకై నా కనిపించవు.
ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి..
ఒక్క గిద్దలూరు పట్టణంలోని 5 మద్యం దుకాణాల్లో బీర్లు, బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకుండా చేయడం ద్వారా ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతున్నట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఈ ఐదు షాపుల్లో బ్రాండెడ్ విక్రయాలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.20 కోట్ల వరకు ఆదాయం కోల్పోతున్నట్లు వివరిస్తున్నారు. అంతేకాకుండా కీలక నేత బార్లో అదనంగా రూ.50 నుంచి రూ.300 వసూలు చేస్తూ కోట్లాది రూపాయలతో ఖజానా నింపుకుంటున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతి క్వార్టర్‌కు ఎమ్మార్పీపై రూ.40 అదనంగా అమ్ముతున్నారు. బీర్లు ఎమ్మార్పీపై రూ.70 నుంచి రూ.100లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఎవరైనా మద్యం ప్రియులు ఇదేంటని ప్రశ్నిస్తే వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేస్తున్నారని, మాట వినకపోతే అలాంటి వారిపై కేసులు బనాయిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. నిజానికి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించడానికి వీలులేదు. ఎవరైనా అలా విక్రయిస్తే ఎకై ్సజ్ కేసులు నమోదు చేసి భారీగా జరిమానా విధించడం వంటి చర్యలు తీసుకుంటారు. అయితే అధికార పార్టీకి చెందిన కీలక నేత బార్‌లో బహిరంగంగానే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నప్పటికీ పట్టించుకునే అధికారి ఒక్కరు కూడా కనిపించడంలేదు. దీంతో యథేచ్ఛగా మద్యం దోపిడీ సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
గిద్దలూరు రూరల్: జీవనోపాధి కోసం తమకు అటవీ హక్కులు కల్పించండని గిరిజనులు శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి వద్ద వేడుకున్నారు. మండలంలోని దిగువమెట్ట తండాలో పర్యటించిన సందర్భంగా చెంచులు వారి సమస్యలను ఆయనకు వివరించారు. అటవీశాఖ ఏర్పడక ముందే గిరిజనులు అడవి మీద ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు. అటవీశాఖ అధికారులు తమను అడవిలోకి వెళ్లనివ్వకుండా తమపై అక్రమంగా కేసులు బనాయిస్తూ జీవనోపాధిపై దెబ్బ కొడుతున్నారన్నారు. తమ జీవనవిధానంలో ఎటువంటి మార్పు రావడం లేదని వాపోయారు. అడవి సమీపంలో ఉన్న తమను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలని వేడుకున్నారు. తండా గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం సమస్యల వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కె.లక్ష్మీ, కె.మల్లీశ్వరరావు, పి.వెంకటప్ప, శ్రీశైలం ఐటీడీఏ పీఓ పీవీఎస్.నాయుడు, ఎస్టీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ కె.సాంబయ్య, మార్కాపురం ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిణి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం: మార్కాపురం జిల్లాలో నేడు జరిగే పాలిసెట్ పరీక్షకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కోఆర్డినేటర్ వలియానాయక్ శుక్రవారం తెలిపారు. మొత్తం 2765 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని, జిల్లా మొత్తం మీద 10 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్కాపురం 4, పొదిలిలో 3, కనిగిరి 2, గిద్దలూరులో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
గిద్దలూరు పట్టణంలోని మద్యం దుకాణాల్లో ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండడం వంటివాటిని ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక నేత సొంత బార్‌పై చర్యలు తీసుకుంటే ఏమవుతుందోనన్న భయం, నెలవారీ మామూళ్లకు అలవాటు పడిపోవడం వల్లనే అధికారం యంత్రాంగం మొత్తం చేతులు కట్టుకొని చోద్యం చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


