సన్‌ రైజింగ్‌..! | - | Sakshi
Sakshi News home page

సన్‌ రైజింగ్‌..!

Apr 25 2026 9:36 AM | Updated on Apr 25 2026 9:36 AM

వేసవి ముదిరింది. సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. రోడ్లపైకొస్తే నడి నెత్తి పగలగొడుతున్నాడు.

మండుటెండలకు తాళలేక ఇంటి నుంచి బయటకొచ్చేందుకు జనం జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ పనులపై బయట తిరిగే వారు ఎండ నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు

పడుతున్నారు. కొంతమంది గొడుగులు వాడుతుండగా, మరికొంత మంది క్లాత్‌ కప్పుకుని

కాపాడుకుంటున్నారు. భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూనే తమతమ పనులు చూసుకుంటున్నారు. మధ్యాహ్న సమయంలో జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

– సాక్షి, ఒంగోలు

జన సంచారం స్వల్పంగా ఉన్న ఒంగోలు చర్చి సెంటర్‌

Advertisement
 
Advertisement
Advertisement