మార్కాపురం: మార్కాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎం.శివశంకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం మార్కాపురం పట్టణంలోని అసోసియేషన్ హాల్లో బార్ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే అసోసియేషన్ కార్యదర్శిగా వి.కాశయ్య, వైస్ ప్రెసిడెంట్‌గా షేక్ మహబూబ్‌వలి, జాయింట్ సెక్రటరీగా కె.రామయ్య, ట్రెజరర్‌గా కమల పద్మజ, మహిళా కార్యదర్శిగా ఆకుల ఉషశ్రీ ఎన్నికయ్యారు. కాగా బార్ అసోసియేషన్ హాల్లో నూతన అధ్యక్షడు శివశంకర్‌రెడ్డిని న్యాయవాదులు అలీ జహీర్, భూపని కాశయ్య, రామిరెడ్డి, రవీంద్రనాఽథ్, వెంకటేశ్వరరెడ్డి, పరుశురాముని సుబ్బరామయ్య, షేక్ సలాం, నారాయణరెడ్డి తదితరులు అభినందించి ఘనంగా సన్మానించారు.
ఉలవపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యూట్యూబర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాలు.. ఉలవపాడు గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి(35) ఒంగోలు కుర్రాడు యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. బుధవారం పెదపట్టపుపాలెంలో మత్స్యకారుల సమావేశాన్ని కవర్ చేయడానికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో చాగల్లు–చాకిచర్ల మధ్య రోడ్డుపై గేదె అడ్డురావడంతో ద్విచక్ర వాహనం నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. మృతదేహన్ని ఉలవపాడుకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులను పలువురు జర్నలిస్టులు పరామర్శించి, సంతాపం తెలియజేశారు.


