మార్కాపురం టౌన్: జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ విజయసునీత అన్నారు. కలెక్టరేట్‌లో జలజీవన్ మిషన్ పథకంపై శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2028 డిసెంబరు నాటికి పథకాన్ని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 2225 పనులను రూ.1780 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. హనుమంతునిపాడు, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో రూ.1802 కోట్లతో తాగునీటి పథకాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. అలాగే జలజీవన్ మిషన్ కింద 119 గ్రామాల్లో తాగునీటి పైపులైన్లు పునరుద్ధరించేందుకు రూ.30.5 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ అబూద్‌ఆలీ, జిల్లా గ్రామీణ నీటిసరఫరా ఈఈ సురేష్‌బాబు, అధికారులు పాల్గొన్నారు.


