వెలిగొండకు నిధులు లేవు..కొత్త జిల్లాకు కేటాయింపుల్లేవు | - | Sakshi
Sakshi News home page

వెలిగొండకు నిధులు లేవు..కొత్త జిల్లాకు కేటాయింపుల్లేవు

Feb 15 2026 6:50 AM | Updated on Feb 15 2026 6:50 AM

వెలిగొండకు నిధులు లేవు..కొత్త జిల్లాకు కేటాయింపుల్లేవు

వెలిగొండకు నిధులు లేవు..కొత్త జిల్లాకు కేటాయింపుల్లేవు

రాష్ట్ర బడ్జెట్‌లో వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు లేవు. దొనకొండ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను అమరావతి ఎకనామిక్‌ జోన్‌గా పేరు మార్చారే తప్ప నిధులివ్వలేదు. మార్కాపురం జిల్లాను ప్రకటించారే తప్ప కేటాయింపులు లేవు. ఈ ప్రకారం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఈ బడ్జెట్‌ తీవ్ర నష్టం కలిగింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటానికి రూ.2,300 కోట్లు కావాల్సి ఉండగా అందులో రూ.900 కోట్లు నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉంది. కానీ అరకొర కేటాయింపులు మాత్రమే చేశారు. ప్రాజెక్టు వచ్చే సంవత్సరం కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. విద్యారంగానికి అరకొర కేటాయింపులు చేశారు. మార్కాపురం కొత్త జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపుల్లేవు. ఇది కేవలం అంకెల గారడీ బడ్జెట్‌.

– డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement