ప్రజలను మోసం చేసే మాయ బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేది లాగే ఉంది తప్ప ఏమాత్రం ఉపయోగం పడేట్టు లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేసిన బడ్జెట్‌లకు, చంద్రబాబు బడ్జెట్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు అవసరమైన కేటాయింపులు బడ్జెట్‌లో లేవు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఒక్కరంటే ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఒక్క కొత్త పెన్షన్‌ను మంజూరు చేయలేదు. ఈ బడ్జెట్ వలన ప్రజలకు ఎంతమాత్రం ఉపయోగం లేదు.
– మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్


