ప్రజలకు ఒరిగేదేమీ లేదు..
రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల గారడీ, మాటల బురిడే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఈ సారి అయినా ఆదుకుంటారని ఆశించిన అక్కచెల్లెమ్మలకు మొండిచేయి చూపించారు. మహిళా నిధికి, నిరుద్యోగ భృతికి కూడా కేటాయింపులు శూన్యం. చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు పాతరవేసినట్లే. అన్నదాత సుఖీభవ పథకానికి రైతుకు రూ.20 వేలు ప్రకారం ఇవ్వాలంటే బడ్జెట్ కేటాయింపులో సంవత్సరానికి రూ 10,700 కోట్లు కావాలి. కానీ కేటాయించింది మాత్రం కేవలం రూ.6 వేల కోట్లు. సున్నా వడ్డీ కింద రుణాలు, పంటలకు ఉచిత బీమా కేటాయింపులు లేనేలేవు. రైతులను పూర్తిస్థాయిలో విస్మరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో ధరల స్థిరీకరణకు రూ.7,800 కోట్లు ఖర్చుచేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది. 2026–27 సంవత్సర బడ్జెట్‌లో రాష్ట్ర ఆదాయాన్ని పెంచి చూపించడం ప్రజలను మోసం చేయడమే.
– తాటిపర్తి చంద్రశేఖర్, వైపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి


