ఉమ్మడి జిల్లాకు అన్యాయం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యం. వెలిగొండ ప్రాజెక్టు కేవలం రూ.412 కోట్లతో ఎలా పూర్తవుతుంది. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అరకొర నిధులను కేటాయించడం దారుణం. నిర్వాసితులను తరలించడానికే రూ.1300 కోట్లు అవసరమవుతాయి. ఈ రకంగా నిధులు కేటాయిస్తే వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాకు బడ్జెట్లో ఎలాంటి నిధులను కేటాయించలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క పరిశ్రమ కానీ, ఉపాధి కల్పించడానికి కేటాయింపులు కానీ చేయలేదు. గుండ్లకమ్మ, కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి అరకొర నిధులు ఇచ్చారు. హార్బర్, విమానాశ్రయాలు అని ఊదరగొట్టారు. వాటికి కూడా కేటాయింపులు లేవు. దొనకొండను పారిశ్రమికంగా అభివృద్ధి చేస్తామన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. ఇక సంక్షేమ పథకాలకు కూడా అంతంత మాత్రంగానే నిధులు కేటాయించారు.
– డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు


