తప్పని భారం | - | Sakshi
Sakshi News home page

తప్పని భారం

Jan 18 2026 8:08 AM | Updated on Jan 18 2026 8:08 AM

తప్పన

తప్పని భారం

ఉపాధి హామీ పథకం సిబ్బందికి రాని జనవరి నెల జీతాలు గతంలో ఇటువంటి పరిస్థితి లేదంటున్న ఉపాధి హామీ సిబ్బంది జీతాలు లేక పండుగ సందడి లేదని ఆవేదన పనిప్రదేశంలో ఫొటోలు మంచివి పంపాలంటూ అదనపు భారం నూతన పథకం వీబీ జీరాంజీ పథకంలో సిబ్బందిలో కోత విధిస్తారంటూ ప్రచారం ప్రభుత్వ తీరుతో నలిగిపోతున్న ఉపాధి హామీ పథకం సిబ్బంది

ఉపాధి కూలీలకు అరొకర కూలీ..

అందని జీతం..

సింగరాయకొండ:

పాధి హామీ పథకంలో కీలకమైన ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఈ నూతన సంవత్సరంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి జీతాలు రావాల్సి ఉండగా ఇంతవరకు రాలేదని, ఎప్పుడు ప్రభుత్వం జీతాలు ఇస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవేదనలోనే సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోలేకపోయామని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు లేక పండుగ సందడి లేక మానసిక వేదన అనుభవిస్తుంటే పుండు మీద కారం చల్లినట్లు గతంలో ఉపాధి హామీ పథకం పనులు జరిగే సమయంలో తీసిన పనిప్రదేశంలో ఫొటోలు కాని, కూలీల ఫొటోలు సక్రమంగా లేవని మంచి ఫొటోలు పంపాలని చెప్పటంతో వీరు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అంతేకాక రాబోయే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నూతన ఉపాధి హామీ పథకం వీబీ–జీరాంజీ పథకం వస్తే ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగిస్తారని ఈ బాధ్యతలు గ్రామ సచివాలయ సిబ్బందికి అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి హామీ పథకం సిబ్బంది:

జిల్లాలో 38 మండలాలు ఉండగా ఉపాధి హామీ పథకం కింద టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ సిబ్బంది సుమారు 1,500 మంది వరకు ఉన్నారు. ప్రతి మండలంలో ఒక ఏపీఓ, ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లు, ముగ్గురు టెక్నికల్‌ అసిస్టెంట్లు ఉండగా ఈ ప్రకారం జిల్లాలో సుమారు 240 మంది వరకు సిబ్బంది ఉంటారు. వీరు కాక గ్రామ స్థాయిలో ఒక్కో గ్రామానికి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉంటారు. ఈ ప్రకారం జిల్లాలో సుమారు 1,500 కుటుంబాల్లో జీతాలు లేక సంక్రాంతి పండుగ సందడి లేని పరిస్థితి ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒకటో తేదీ జీతాలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ విధంగా ముఖ్యమైన పండుగకు కూడా జీతాలు ఇవ్వకపోవటంపై ఉపాధి హామీ పథకం సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీబీ జీరాంజీ పథకంపై ఆందోళన:

నూతన సంవత్సరంలో జీతాలు రాక ఆందోళన చెందుతున్న ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే వీబీ జీరాంజీ పథకం మార్గదర్శకాలతో నిద్రలేని రాత్రులు గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పథకం అమలులోకి వస్తే సిబ్బంది సంఖ్య తగ్గించే అవకాశం ఉందని ప్రస్తుతం ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్వహించే బాధ్యతలను గ్రామ సచివాలయ సిబ్బందికి అప్పగిస్తారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతుండటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జీతాలు లేక అల్లాడుతున్నామని, తమని విధుల్లో నుంచి తప్పిస్తే మా పరిస్థితి, మా పై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యమైన ఫొటోలు పంపండి..

జనవరి నెల జీతాలు లేక మానసికంగా వేదన అనుభవిస్తుంటే గతంలో పనులు జరిగే సమయంలో మీరు పంపిన ఫొటోలు బాగా లేవని, పనుల ఫొటోలతో పాటు కూలీల ఫొటోలు ఈనెల 25వ తేదీలోపు నాణ్యమైనవి మళ్లీ పంపాలని ఆదేశాలు జారీ చేయటంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోల పర్యవేక్షణకు మూడు మండలాలకు కలిపి ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించినట్లు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ప్రకారం దర్శి, ముండ్లమూరు, తాళ్లూరుకు టీ కల్పన, కురిచేడు, దొనకొండ, మర్రిపూడికి డీ సుధాకరరెడ్డి, పొన్నలూరు, కొండపి, సింగరాయకొండకు వీ రామకృష్ణ, టంగుటూరు, ఒంగోలు, జరుగుమల్లికి కె నాగేశ్వరరావు, ఎస్‌ఎన్‌పాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడుకు జీ చంద్రశేఖర్‌, చీమకుర్తి, కొత్తపట్నంకు ఎస్‌ శ్రీనివాసులును నియమించింది. గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిప్రదేశంలో తీసిన ఫొటోలను ఇష్టారాజ్యంగా పలు పనులకు సంబంధించి పంపి చేతులు దులుపుకున్నారని అంతేకాక కూలీల ఫొటోలు కూడా అవకతవకలుగా పంపారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మగవారు పనిచేస్తే ఆడవారు పనిచేసినట్లు, ఆడవారు పనిచేస్తే మగవారు పనిచేసినట్లు ఇష్టం వచ్చినట్లు నమోదు చేశారని అంతేకాక ఒక పనికి 10 మంది మాత్రమే వస్తే తల ఒక్కింటికి అన్నట్లు ఆ పదిమందిని 30 మందిగా చూపించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ ఫొటోలు సరిచేసి పంపాలంటే ఎలాగని సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు కూలీల పనిచేసిన వేతనాలు వారికి బ్యాంకు ఖాతాలకు జమయ్యాయని ఒకవేళ రేపు వాస్తవాలు బయటకు వస్తే కూలీలకు చెల్లించిన మొత్తాలను తమ వద్ద రికవరీ చేస్తారా అన్న అనుమానాలు ఫీల్డ్‌ అసిస్టెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉపాధి హామీ పథకం సిబ్బందికి చంద్రబాబు ప్రభుత్వం చుక్కులు చూపిస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 3,60,766 యాక్టివ్‌ జాబ్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 6,27,389 మంది కూలీలు పనిచేస్తుండగా వీరిలో 3,39,988 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఎస్సీలు 1,67,950 మంది ఉండగా ఎస్టీలు 19,275 మంది, ఇతరులు 4,40,164 మంది ఉన్నారు. ఈ ప్రకారం ఈ పథకం కింద బడుగు, బలహీన వర్గాల ప్రజలే ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంటారు. ఒక్కో కూలీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిరోజు రూ.307 ఇవ్వాల్సి ఉండగా వారి ఖాతాల్లో కేవలం వారానికి రూ.900 నుంచి రూ.1,500 మాత్రమే జమవుతుందని కూలీలు వాపోతున్నారు. ప్రస్తుతం కూలీల వేతనాలన్నీ ఇచ్చారని, ఇంకా ఒకటి రెండు వారాలు మాత్రమే బకాయి ఉందని చెబుతున్నారు.

తప్పని భారం1
1/2

తప్పని భారం

తప్పని భారం2
2/2

తప్పని భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement