పార్టీ కమిటీ నియామకాలను పూర్తి చేసుకుందాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
చీమకుర్తి:
గ్రామస్థాయి, అనుబంధ కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేసుకుందామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో శివప్రసాదరెడ్డితోపాటు జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ఇప్పటి నుంచే పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మండల స్థాయి నాయకులు గ్రామ కమిటీల నియామకాలను పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రూరల్ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్‌లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


