సంక్రాంతి కప్ విజేత.. శ్రీసీసీ చైన్నె జట్టు
● రన్నరప్‌గా ఎస్‌కేఎం సీసీ చైన్నె జట్టు
మేదరమెట్ల: రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి కప్ పేరుతో నిర్వహించిన 32వ అంతర్ రాష్ట్ర కికెట్ పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌కేఎం సీసీ చైన్నె జట్టుపై 7 పరుగుల తేడాతో శ్రీసీసీ చైన్నె జట్టు గెలిచి సంక్రాంతి కప్–2026 అందుకుంది. ముందుగా టాస్ గెలిచిన శ్రీసీసీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం 167 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఎస్‌కేఎంసీసీ చైన్నె జట్టు 19 ఓవర్లలో 160 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఏడు పరుగుల తేడాతో శ్రీసీసీ చైన్నె జట్టు ఎస్‌కేఎంసీసీ చైన్నె జట్టుపై విజయం సాధించి సంక్రాంతి కప్ విజేతగా నిలిచింది. ఎంఆర్‌సీసీ చైన్నె జట్టు మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచిన శ్రీసీసీ చైన్నె జట్టుకు సింథైట్ కంపెనీ నుంచి రూ.3 లక్షల నగదుతో పాటు కప్‌ను, రెండో స్థానంలో నిలిచిన ఎస్‌కేఎం సీసీ చైన్నె జట్టుకు బ్రమర టౌన్‌షిప్ నుంచి రూ.2 లక్షలు, కప్, మూడో స్థానంలో నిలిచిన ఎంఆర్‌సీసీ చైన్నె జట్టుకు కృతి డెవలెపర్స్ నుంచి రూ.లక్ష నగదు, కప్ అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, అమర్నేని ఆంజనేయులు, పీడీసీసీబీ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ కిరణ్‌కమార్, మువ్వా తిలక్, సింగమేని శ్రీనివాసరావు, కారుసాల నాగేశ్వరరావు, రామినేని శ్రీనివాసరావు, నరసింహారావు, వెంకట్రావు, నాగార్జున అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


