బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Nov 5 2025 7:47 AM | Updated on Nov 5 2025 7:47 AM

బుధవా

బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 – 10లో..

మోంథా తుపానుతో నిండా మునిగిన పత్తి రైతులు పొలాల్లో నీళ్లు నిలిచి మసిబారిన పత్తికాయలు జిల్లాలో 12,759 హెక్టార్లలో పత్తి సాగు ఎకరాకు 3 క్వింటాళ్ల మేర పత్తి నష్టం జిల్లా రైతులకు సుమారు రూ.67 కోట్లు నష్టం

మోంథా తుపాను పత్తి రైతును చిత్తు చేసింది. తెల్లబంగారంగా భావించే పత్తి ఈ ఏడాది రైతుల ఆశలను మసిచేసింది. తుపాను తాకిడికి రోజుల తరబడి పొలాల్లో నీళ్లు నిలవడంతో పత్తి కాయలు నల్లరంగులోకి మారిపోయాయి. తుపాను వల్ల జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులకు రూ.67 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.

మసిబారిన ఆశలు

మార్కాపురం: మోంథా తుపాన్‌ రైతులకు కన్నీరే మిగిల్చింది. ఎడతెరిపి లేని వర్షాలకు పంటలన్నీ వర్షార్పణం అయ్యాయి. వర్షం నీటిలో మునిగిన పంట పొలాలను చూసి రైతులు కుమిలిపోతున్నారు. పొలాల్లోనే రోజుల తరబడి నీళ్లు నిలవడంతో పత్తికాయలన్నీ నల్లబడిపోయాయి. ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర రూ.8110 గా ప్రకటించింది. వ్యాపారులు మాత్రం బాగా ఉన్న పత్తిని రూ.6 వేలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తుపాను కారణంగా పత్తి చేలన్నీ నల్లటి కాయలతో రైతు గుండెను పిండేస్తున్నాయి. మరో వైపు సీసీఐ మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇంకా ప్రారంభించలేదు. దీంతో వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు పత్తిని అమ్ముకోవాల్సి వస్తోంది. రోజుకు పత్తి కోసేందుకు కూలీలకు రూ.250 నుంచి రూ.300 చెల్లిస్తున్నారు. అయినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక పత్తి రైతు విలవిల్లాడిపోతున్నారు.

జిల్లాలో ఇలా...

జిల్లా వ్యాప్తంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, కొండపి, ఒంగోలు ఏడీఏల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి 12,759 హెక్టార్లలో సాగు చేశారు. ఎకరాకు సుమారు 6 నుంచి 8 క్వింటాళ్ల వరకూ వస్తుందని, క్వింటా రూ.8 వేల ప్రకారం అమ్మినా ఎకరాకు రూ.60 వేలకు పైగా రావచ్చని, పెట్టుబడుల రూపంలో రూ.30 వేలు ఖర్చుచేసినా మరో రూ.30 వేలు మిగులుతాయని ఆశపడిన రైతులకు నిరాశే మిగిలింది. గత వారం కురిసిన వర్షాలతో జిల్లాలో పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. ఎకరాకు 3 క్వింటాళ్ల వరకూ పత్తి పాడైంది. దీంతో సగటున రూ.7 వేల ప్రకారం వేసుకున్నా సాగవుతున్న 12,759 హెక్టార్లకు గానూ హెక్టారుకు సుమారు 95,692 క్వింటాళ్ల వరకూ పత్తి దిగుబడులను రైతులు కోల్పోయారు. క్వింటా సరాసరి ధర రూ.7 వేల ప్రకారం రైతులు సుమారు రూ.67 కోట్ల విలువైన పత్తి దిగుబడులను నష్టపోయారు. మార్కాపురం వ్యవసాయ సబ్‌డివిజన్‌లో మార్కాపురం మండలంలో 3040 హెక్టార్లు, తర్లుపాడులో 99 హెక్టార్లు, పెద్దారవీడులో 1508, అర్ధవీడులో 102 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తుపాను ప్రభావంతో పత్తి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్‌ శ్రీ 20251
1/1

బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement