డీఆర్‌సీకి పూర్తి సమాచారంతో రావాలి | - | Sakshi
Sakshi News home page

డీఆర్‌సీకి పూర్తి సమాచారంతో రావాలి

Nov 5 2025 7:17 AM | Updated on Nov 5 2025 7:17 AM

డీఆర్

డీఆర్‌సీకి పూర్తి సమాచారంతో రావాలి

డీఆర్‌సీకి పూర్తి సమాచారంతో రావాలి చెరువులో జారిపడి వ్యక్తి మృతి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ జీజీహెచ్‌లో ఆడియోమెట్రిక్‌ రూం ప్రారంభం

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: డీఆర్‌సీ సమావేశానికి పూర్తిస్థాయి సమాచారంతో సన్నద్ధం కావాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. ఈనెల ఏడో తేదీన డీఆర్‌సీ సమావేశం ఉన్న నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణతో కలిసి వివిధ విభాగాల ఉన్నతాధికారులతో మంగళవారం ప్రకాశం భవనంలోని తన ఛాంబర్‌లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తయారు చేయడంపై చర్చించారు. జిల్లాలో ఇటీవలి తుఫాన్‌ ప్రభావం, వివిధ రంగాలలో నష్టం, వాటి అంచనాల రూపకల్పన, తదితర అంశాలపై పూర్తిస్థాయి సమాచారంతో సమావేశానికి సిద్ధం కావాలని కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు.

టంగుటూరు: చెరువులో జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషను ఎదురుగా ఉన్న చెరువులో మంగళవారం జరిగింది. పోలీసులు వివరాల మేరకు..టంగుటూరు ముత్తరాజుపాలెంకు చెందిన మామిళ్ల చిరంజీవి(59) తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో జారిపడి మృతిచెందాడు, అటుగా పోతున్న బాటసారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.

ఒంగోలు: జాతీయస్థాయి సబ్‌జూనియర్‌ ఫెన్సింగ్‌ పోటీలకు చప్పిడి జ్ఞానేశ్వర్‌ ఎంపికై నట్లు ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జి.నవీన్‌ తెలిపారు. ఇటీవల కాకినాడలో జరిగిన అండర్‌–14 సబ్‌ జూనియర్‌ ఈపీ విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. ఈ క్రమంలో ఈ నెల 6, 7 తేదీల్లో మణిపూర్‌ రాష్ట్రం కుమాన్‌లంపాక్‌ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు హాజరయ్యేందుకు అర్హత సాధించాడు. ఈ స సందర్భంగా జ్ఞానేశ్వర్‌ను ప్రకాశం జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు తదితరులు అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లోను సత్తా చాటి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలన్నారు.

ఒంగోలు వన్‌టౌన్‌: ఒంగోలు రూడ్‌ సెట్‌ సంస్థలో ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రూడ్‌ సెట్‌ సంస్థ డైరెక్టర్‌ పీ శ్రీనివాస రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత శిక్షణ నవంబర్‌ 24 తేదీ నుంచి 31 రోజుల పాటు ఉంటుందన్నారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంతాల వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులకు ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో పూర్తి ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారన్నారు. ఇతర పూర్తి వివరాలకు, రిజిస్ట్రేషన్‌కు సెల్‌: 8309915577 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

ఒంగోలు టౌన్‌: వినికిడి లోపంతో బాధపడేవారికి మెరుగైన చికిత్స అందించే ఆడియో మెట్రిక్‌ రూంను మంగళవారం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాణిక్యరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌ ప్రారంభించారు. పీజీ నిధులతో ఈఎన్‌టీ విభాగంలో ఆడియో మెట్రిక్‌ రూంతో పాటు ఓటో ఎకాస్టిక్‌ ఎమిషన్‌ పరికరాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పుట్టుకతో వినికిడి లోపం ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌ అద్దయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌, ఈఎన్‌టీ హెచ్‌ఓడి ప్రభాకర్‌, ఆర్‌ఎంఓ మాధవీలత, డిప్యూటీ ఆర్‌ఎంఓ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌సీకి పూర్తి  సమాచారంతో రావాలి 1
1/3

డీఆర్‌సీకి పూర్తి సమాచారంతో రావాలి

డీఆర్‌సీకి పూర్తి  సమాచారంతో రావాలి 2
2/3

డీఆర్‌సీకి పూర్తి సమాచారంతో రావాలి

డీఆర్‌సీకి పూర్తి  సమాచారంతో రావాలి 3
3/3

డీఆర్‌సీకి పూర్తి సమాచారంతో రావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement