సోషల్ మీడియా సైకోల హెడ్స్ చంద్రబాబు, లోకేష్
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తండ్రి కొడుకులు ఇద్దరూ సోషల్ మీడియా సైకోల హెడ్స్ అని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అండతో వీధి శునకాలు సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులతో చెలరేగి పోతున్నాయని మండిపడ్డారు. ఐ–టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ ఇటీవల తమ నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అతడిని అరెస్ట్ చేశామని, తమ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని కూటమి ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కిరణ్ గతంలో అనేక పర్యాయాలు అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు కూటమి నాయకులు శునకానందం పొందారని, ఇప్పుడేందో వారు కథలు చెప్పి రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.


