సేవలు దూరం..
ఊరు: సింగరాయకొండ మండలం, చిన్న కనుమళ్ల గ్రామం..
ిసింగరాయకొండ మండలం చిన్న కనుమళ్ల గ్రామం. ఈ గ్రామ వాసులు ఉద్యోగాల రీత్యా పొరుగు ప్రాంతాల్లో ఉంటున్నారు. సంక్రాంతి పండుగను తమవారితో జరుపుకునేందుకు సొంతూరికి వచ్చారు. గ్రామం అంతా కలియదిరిగారు. కనుమళ్ల గ్రామ సచివాలయానికి మంగళవారం సాయంత్రం 4 గంటల సమయానికి వెళితే సిబ్బంది లేక ఖాళీగా ఉన్న కుర్చీలు దర్శనమిచ్చాయి. వ్యవసాయాధికారి పొలం పిలుస్తోంది కార్యక్రమానికి వెళ్లడంతో రైతు సేవా కేంద్రం మూతపడి ఉంది. ఈ దృశ్యాలు వారిని మరింతగా కలిచివేశాయని చెప్పుకొచ్చారు. వెనుకబడిన ప్రకాశంలో జిల్లాలో వైఎస్ రాజశేఖరెడ్డి ఒంగోలులో ప్రభుత్వ మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా రిమ్స్‌ను ఏర్పాటు చేసి అత్యాధునిక వైద్యసేవలు అందేలా చేశారని, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేశారు. దాదాపు 70 శాతం పనులు పూర్తి చేశారు. మార్కాపురం జీజీహెచ్‌ను సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా మార్చేందుకు అన్నీ చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు వచ్చాక పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడాన్ని తప్పు బట్టారు. మెడికల్ కాలేజీలు నిర్వహించలేని చంద్రబాబు రూ.1,700 కోట్లు పెట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా పెడతాడని, ఇదో డ్రామా అంటూ వారు అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదని, పేదలకు నరకం చూపిస్తున్న ప్రభుత్వమని ఆరోపించారు. వారి అభిప్రాయాలు..
పింఛన్ కోసం అవస్థలు..
నేను బేల్దారి పనిచేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తున్నాను. ప్రతి సంవత్సరం పండక్కి స్వగ్రామం వస్తాను. ఈ ఏడాది ఊళ్లో పండుగ సందడి లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉంది. గతంలో ఒకటో తేదీ ఇంటి తలుపు తట్టి గ్రామ వలంటీర్ పింఛన్ ఇచ్చేది. దీంతో గడప దాటే పనిలేదు. కానీ నేడు ఒకటో తేదీ రాగానే గ్రామంలోని ఆలయం వద్దకు వస్తే గానీ పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు. అనారోగ్యం గా ఉన్నా, నడవలేని వృద్ధులైనా పింఛన్ కోసం గుడి వద్దకు వెళ్లాల్సిందే.
– చొప్పర సునీల్, బేల్దారి మేస్త్రి, చిన్న కనుమళ్ల గ్రామం
సేవలు దూరం..


