చేబ్రోలు కిరణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఒంగోలు టౌన్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నియోజకవర్గ ఇన్‌చార్జి బడుగు ఇందిర ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీడియో చిత్రీకరించిన పాయింట్ బ్లాక్ టీవీతో పాటుగా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి, ఐటిడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఒక ప్రణాళిక ప్రకారమే అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. సమాజంలో గౌరవనీయంగా బతికే నాయకులను, వారి కుటుంబసభ్యులను అవమానించడమే లక్ష్యంగా వీడియోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు భూమిరెడ్డి రమణమ్మ, లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మాసి హరిబాబు, సమాచార హక్కు విభాగం అధ్యక్షుడు కె. శేషాద్రిరెడ్డి, న్యాయవాది గాయం సావిత్రి, బి.నాగమల్లేశ్వరరెడ్డి, పార్టీ మహిళా విభాగం నాయకురాలు షేక్ అఫ్సర్, బత్తుల ప్రమీల, మాధవి, జ్యోతి, మేరి, వాణి, ప్రసన్న, రాజేశ్వరి పాల్గొన్నారు.
యర్రగొండపాలెం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను కఠినంగా శిక్షించాలని పార్టీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి కె.ఓబులరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, వైస్ ఎంపీపీ ఎం.ఆదిశేషు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఒ.సుబ్బారెడ్డి, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఎం.బాలగురవయ్య, సచివాలయాల మండల కన్వీనర్ సయ్యద్ జబీవుల్లా, ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షుడు పబ్బిశెట్టి శ్రీనివాసులు, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పి.రాములు నాయక్, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ షాబీర్ బాష, సర్పంచ్‌లు బి.అరుణాబాయి, కె.వెంకటేశ్వరరెడ్డి, ఆర్.వెంకటయ్య, నాయకులు ఎన్.వెంకటరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, టి.రాంబాబు, కె.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
చేబ్రోలు కిరణ్‌ను కఠినంగా శిక్షించాలి


