ఫోన్లు ఇచ్చేసి నిరసన..
మారుమూల ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నెట్ వర్క్ కష్టాలు అధికంగా ఉండడంతో కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. అన్ని యాప్‌లను కలసి ఒక యాప్‌గా చేస్తామని చెప్పి తమను పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా యాప్‌ల పేరుతో ఇబ్బందులు గురిచేస్తుండడంతో ఐదు రోజుల కిందట అంగన్‌వాడీ కార్యకర్తలు తమ ఫోన్లను ఒంగోలు పీడీ కార్యాలయంలో ఇచ్చి తమ నిరసనను తెలియజేసి వెళ్లిపోయారు. అయితే పీడీ ఆదేశాల మేరకు సూపర్‌వైజర్లు, సీడీపీవో ప్రాజెక్టుల వారీగా అంగన్‌వాడీ వర్కర్లకు ఫోన్లను బలవంతంగా ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కార్యకర్తలు ఆ ఫోన్లను వినియోగించడంలేదని తెలిసింది.


