బ్యాక్‌లాగ్‌ పోస్టుల మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బ్యాక్‌లాగ్‌ పోస్టుల మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

Dec 2 2023 1:24 AM | Updated on Dec 2 2023 1:24 AM

- - Sakshi

ఒంగోలు సెంట్రల్‌: 2021–22 సంవత్సర దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల సాధారణ మెరిట్‌ జాబితాపై అభ్యంతరాలను పూర్తి ఆధారాలతో తెలపాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జీ అర్చన తెలిపారు. ప్రత్యేక ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా అభ్యంతరాల స్వీకరణ కోసం గ్రూప్‌–4, క్లాసు–4 పోస్టుల సాధారణ మెరిట్‌ జాబితాను అభ్యర్థుల పరిశీలనకు వెబ్‌సైట్‌ ‘‘www.prakasam.ap.gov.in/notice_category/recruitment’’లో ఉంచినట్లు చెప్పారు. అభ్యర్థులు వెబ్‌ సైట్‌ను ఈనెల 2 నుంచి 8వ తేదీలోపు పరిశీలించి అభ్యంతరాలుంటే పూర్తి ఆధారాలతో నిర్ణీత సమయంలో తెలియజేయాలని కోరారు. సందేహ నివృత్తి కోసం 08592–281310 నంబర్‌ను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని వివరించారు.

రేషన్‌ పంపిణీ తనిఖీ చేసిన జేసీ శ్రీనివాసులు

ఒంగోలు అర్బన్‌: స్థానిక కేశవస్వామి పేటలో పంపిణీ చేస్తున్న రేషన్‌ వాహనాన్ని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎండీయూ వాహనం ఆపరేటర్‌, వలంటీర్‌, వీఆర్‌ఓలతో పాటు కార్డుదారులను రేషన్‌ పంపిణీపై ఆరా తీశారు. ప్రతి కార్డుదారునికి రేషన్‌ సరుకులు పక్కాగా అందజేయాలని సూచించారు. దీనిలో డీఎస్‌ఓ ఉదయభాస్కర్‌, ఒంగోలు తహశీల్దార్‌ మురళి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఆర్‌వీఎస్‌ కృష్ణమోహన్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వూతకోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

తొలిరోజే 70 శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ

ఒంగోలు టౌన్‌/మద్దిపాడు: జిల్లాలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ చేతివృత్తిదారులకు సంబంధించి పింఛన్ల పంపిణీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు 75.56 శాతం పూర్తయింది. 2,93,046 మంది పెన్షన్‌ లబ్ధిదారులకు రూ.81.48 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నవంబరు చివరి నాటికే విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల ఖాతలకు జమ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు గ్రామంలో పెన్షన్‌ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్‌ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్‌ అందజేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ జరిగేలా చూడాలని, 100 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందికి ఆయన సూచించారు.

3న హ్యాండ్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

ఒంగోలు: హ్యాండ్‌బాల్‌ సబ్‌ జూనియర్‌ బాలబాలికల జట్ల ఎంపిక ఈనెల 3న స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి పి.విజయ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికకు 2008 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఎంపికకు వచ్చేవారు తమ వెంట వయస్సు ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలన్నారు.

పీజీ సెల్ఫ్‌ సపోర్టు కోర్సుల ప్రవేశాలకు అవకాశం

ఒంగోలు: స్థానిక ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు పోస్టు గ్రాడ్యుయేషన్‌ సెల్ఫ్‌ సపోర్టు కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అడ్మిషన్స్‌ విభాగం సంచాలకుడు డాక్టర్‌ జి.సోమశేఖర తెలిపారు. ఎంఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌, ఎంఎస్‌సీ ఆక్వాకల్చర్‌, ఎంఎస్‌సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు పీజీ అడ్మిషన్స్‌ కార్యాలయాన్ని సెల్‌ నంబర్లు 6304343448, 8978496178లలో సంప్రదించాలన్నారు.

ఏడుగుండ్లపాడు గ్రామంలో పెన్షన్‌ పంపిణీ చేస్తున్న డీఆర్డీఏ పీడీ రవికుమార్‌1
1/1

ఏడుగుండ్లపాడు గ్రామంలో పెన్షన్‌ పంపిణీ చేస్తున్న డీఆర్డీఏ పీడీ రవికుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement