
జనగామ: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్న సీఎం కేసీఆర్.. ఆయన ఇలాకా గజ్వేల్‌లో ఎన్ని గంటల విద్యుత్ ఇస్తున్నారో చెప్పాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తన పాదయాత్ర సందర్భంగా జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపూర్ క్యాంపు వద్ద ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు.
కరెంటు మిగులు రాష్ట్రం అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్న కేసీఆర్, రూ.50 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలు ఎలా కూరుకుపోయాయో చెప్పాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.