YSRCP ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల | YSRCP reshuffle of Assembly constituency in charges 2 List Out | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల

Jan 2 2024 8:57 PM | Updated on Jan 29 2024 11:47 AM

YSRCP reshuffle of Assembly constituency in charges 2 List Out - Sakshi

వై నాట్‌ 175 లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జిలను.. 

గుంటూరు, సాక్షి:  వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇంఛార్జిల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంగళవారం పార్టీ సీనియర్‌ నేత.. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది.

‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు.

ఈ క్రమంలో సామాజీక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి.  ఎంపీలకూ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement