
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీడీపీకి అవసరం లేదని మండిపడ్డారు.
చదవండి: పోలవరంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన వివరాలిలా..
‘‘ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ద్వేషం ఎందుకు?. గతంలో టీడీపీ అధికారంలోకి రావడంలో ఉత్తరాంధ్రదే కీలక పాత్ర. అమరావతి.. చంద్రబాబు పెట్టుబడుల రాజధాని. సీఆర్‌డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ’’ అంటూ గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు.
‘‘రాష్ట్రంలో అన్ని జిల్లాలనూ అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియా అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తోంది. రామోజీరావు తన వ్యాపారాలు విశాఖ నుంచే మొదలుపెట్టారు. విశాఖ మునిగిపోతుందంటూ రాధాకృష్ణ జ్యోతిష్యం చెబుతున్నారు. విశాఖ మీద ఎందుకు విషం చిమ్ముతున్నారంటూ’’ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ నిప్పులు చెరిగారు.