ఆగని టీడీపీ అరాచక పర్వం.. గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | Ysrcp Complaint To Governor About Tdp Attacks | Sakshi
Sakshi News home page

ఆగని టీడీపీ అరాచక పర్వం.. గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Published Sat, Jun 29 2024 5:41 PM | Last Updated on Sat, Jun 29 2024 6:10 PM

Ysrcp Complaint To Governor About Tdp Attacks

: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది.

సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్‌సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ బృందం గవర్నర్‌ను కలిసింది.

గవర్నర్‌ కలిసిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గాలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భదత్రలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ ఆఫీసుల నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement