
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఫరీద్ పేట సమీపంలోని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై వైఎస్సార్‌సీపీ కార్యకర్త సత్తారు గోపీని కర్రలు, రాళ్లతో కొట్టి దుండగులు హత్య చేశారు.
పట్టపగలు నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. టీడీపీ గుండాలే హత్య చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్తారు గోపీ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా, ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే అదే గ్రామంలో కూన ప్రసాద్ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తను దండగులు హత్య చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు.