
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'విమర్శలు నమ్మశక్యంగా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలనే లాజిక్‌ను చంద్రబాబు గారు ఎప్పుడో గాలికొదిలారు. సీఎంగా జగన్ గారు చేసింది శూన్యమంట. ఈయన పథకాలనే పేరుమార్చి అమలు చేస్తున్నాడట. గ్రాఫిక్స్ హోరు తప్ప తమరు పెట్టిన నాలుగు వెల్ఫేర్ స్కీముల పేర్లు చెప్పండి బాబూ?' అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ('చిటికెలేస్తాడు బయటకు రావాలంటే వణుకు')
కాగా, మరో ట్వీట్‌లో.. 'ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏం చెబుతోంది..?. చంద్రబాబుది- తన కోసం, తన వారికోసం ఆరాటం. జగన్ గారిది- వందల కులాలు, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతర పోరాటం' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. (దొంగ దీక్షలకు 300 కోట్లు ఊదేశాడు)