ఆర్జేడీ కూటమిని వీడిన ఆర్‌ఎల్‌ఎస్పీ

Upendra Kushwahas RLSP To Exit From Grand Alliance In Bihar - Sakshi

 థర్డ్‌ ఫ్రంట్‌ దిశగా సంకేతాలు

పట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలక ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విపక్ష ఆర్జేడీ కూటమి నుంచి వైదొలగుతున్నామని రాష్ర్టీయ లోక్‌ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్పీ) స్పష్టం చేసింది. ఆర్జేడీ కూటమిలో తేజస్వి యాదవ్‌ నాయకత్వాన్ని తాము ఆమోదించబోమని ఆర్‌ఎల్‌ఎస్పీ చీఫ్‌, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వహ ఇప్పటికే తేల్చిచెప్పారు. కాగా బీఎస్పీతో కలిసి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కుష్వహ ప్రకటించారు. మరోవైపు బిహార్‌ మాజీ సీఎం నితిన్‌ రామ్‌ మాంఝీ ఇప్పటికే ఎన్డీయే గూటికి చేరారు.మహాకూటమి నుంచి ఆర్‌ఎల్‌ఎస్పీ బయటకు రావడంతో బీఎస్పీ, ఎంఐఎంలతో ఆ పార్టీ జట్టుకట్టి మూడో ఫ్రంట్‌గా ప్రజల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం.

ఇ​క పట్నాలో బీఎస్పీ నేతలను కుష్వహ కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. చిన్న పార్టీలతో చర్చలు కీలక దశలో ఉన్నాయని ఆర్‌ఎల్‌ఎస్పీ వర్గాలు పేర్కొన్నారు. మరోవైపు ఎన్డీయే నుంచి తమకు ఆహ్వానం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ-జేడీ(యూ) కూటమితో రాం విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ తెగతెంపులు చేసుకుంటుందనే వార్తల నేపథ్యంలో మహా కూటమి నుంచి ఆర్‌ఎల్‌ఎస్పీ వైదొలగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది. చదవండి : సీఎం అభ్యర్థిపై పోటాపోటీ.. కూటమికి బీటలు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top