బీసీ ఆడబిడ్డకు బీజేపీ అన్యాయం: కేటీఆర్‌

Tula Uma Joins BRS Party In Presence Of KTR - Sakshi

బీఆర్‌ఎస్‌లో చేరిన తుల ఉమ, ఆలేరు నేతలు 

 సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుల ఉమకు బీ ఫారం ఇవ్వకుండా చివరి నిమిషంలో నిరాకరించడం ద్వారా బీసీ ఆడబిడ్డను బీజేపీ అవమానించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్‌ ఇచ్చిన బీజేపీ, బీసీ నేతలను అవమానాలకు గురి చేస్తోందన్నారు. కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్, బీజేపీ నాయకురాలు తుల ఉమ సోమవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

అనంతరం తుల ఉమతో పాటు ఆమె వెంట వచ్చిన నేతలను కేటీఆర్‌ పార్టీలోకి ఆహ్వనించారు. గతంలో బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తుల ఉమకు మరింత సమున్నత స్థానం కల్పిస్తామన్నారు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరని, వేములవాడ టికెట్‌ విషయంలో మరొకరికి దొంగదారిలో బీ ఫారం ఇచ్చారని తుల ఉమ అన్నారు.

బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి కల అని, కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని మాత్రమే ఆ పార్టీ నేతలు చూస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా, ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు సుదగోని హరిశంకర్‌గౌడ్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం హరిశంకర్‌గౌడ్‌తో పాటు పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్, మేడబోయిన పరశురాములు, ఉదయకిరణ్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులను కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వనించారు. నల్లగొండ డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

బీఆర్‌ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి 
మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆదివారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి, తిరిగి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారో అర్ధంకాలేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. డబ్బు మదంతో విర్రవీగుతున్న రాజగోపాల్‌రెడ్డికి మునుగోడులో బుద్ధి చెప్పాలన్నారు. గౌరవం లేనిచోట ఉండకూడదనే తన తండ్రి మాటలు స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్‌ను వీడినట్లు పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-11-2023
Nov 13, 2023, 16:23 IST
బీజేపీ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండదు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన.. 
13-11-2023
Nov 13, 2023, 16:16 IST
సాక్షి,ఖమ్మం : తన నామినేషన్‌ తిరస్కరించాలని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు....
13-11-2023
Nov 13, 2023, 14:55 IST
పీసీసీ అధ్యక్షుడు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్‌చాలని
13-11-2023
Nov 13, 2023, 14:37 IST
సాక్షి,ఖమ్మం : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అఫిడవిట్‌ నిబంధనలకు అనుగుణంగా లేదని ఖమ్మం నియోజకవర్గ  కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు....
13-11-2023
Nov 13, 2023, 14:32 IST
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రనేత రాహుల్‌ గాంధీ.. 
13-11-2023
Nov 13, 2023, 13:31 IST
సాక్షి,తెలంగాణ:  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. తమ కుటుంబం నుంచి చట్టసభకు ఎన్నికవుతున్నారంటే ఎవరికి...
13-11-2023
Nov 13, 2023, 12:33 IST
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కొన్నిసార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటాయి.  తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు పోటీపడి అందర్ని ఆశ్చర్యానికి గురి...
13-11-2023
Nov 13, 2023, 12:17 IST
దుద్దిళ్ళ శ్రీధర్ బాబు..కాంగ్రెస్‌లో సీనియర్, కీలక నాయకుడు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో ఎదిగిన శ్రీధర్‌బాబు సమయోచితంగా వ్యూహాలు రచిస్తూ ముందడుగు...
13-11-2023
Nov 13, 2023, 12:07 IST
ఎన్నికల ద్వారా అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి అధికారం కాపాడుకోవాలని...ప్రతిపక్షంలో ఉన్నవారికి పవర్‌లోకి...
13-11-2023
Nov 13, 2023, 12:01 IST
హుస్నాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో వెన్నుదన్నుగా సహాయ సహకారాలు అందించి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒడితెల కుటుంబం నుంచి...
13-11-2023
Nov 13, 2023, 11:56 IST
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి /పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ...
13-11-2023
Nov 13, 2023, 11:40 IST
ఆ ఎమ్మెల్యేలకు ప్రజలే ప్రత్యర్థులవుతున్నారు. క్యాడరే ఎదురు తిరుగుతోంది. ప్రజా ప్రతినిధులు పార్టీకి దూరమవుతున్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవడంతో...
13-11-2023
Nov 13, 2023, 10:43 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే ప్రచారంలో బీజేపీ నేతలు దూసుకుపోతున్నారు. ఈ...
13-11-2023
Nov 13, 2023, 09:08 IST
'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులూ ఉండరు.  ఈ నానుడికి ఆ నియోజకవర్గం నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ఇప్పుడు...
13-11-2023
Nov 13, 2023, 08:05 IST
ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ప్రమాదకరంగా తయారయ్యారు. అధికార గులాబీ పార్టీ అభ్యర్థికే ఈ...
13-11-2023
Nov 13, 2023, 08:01 IST
సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి....
13-11-2023
Nov 13, 2023, 07:54 IST
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని...
12-11-2023
Nov 12, 2023, 15:51 IST
సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌ గూండాలు తనపై దాడి చేశారని, తన  కాన్వాయ్‌ని వెంబడిస్తూ దాడి చేశారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...
12-11-2023
Nov 12, 2023, 13:58 IST
సాక్షి,హైదరాబాద్‌ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, ఆమెకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు...
12-11-2023
Nov 12, 2023, 13:48 IST
సాక్షి, నిజామాబాద్‌/కామారెడ్డి: కామారెడ్డిలో 29 ఏళ్లుగా గంప గోవర్ధన్‌, షబ్బీర్‌ అలీల మధ్య ఎన్నికలు ఉద్ధండుల మధ్య సమరంలా జరిగేవి. ఇద్దరికీ...



 

Read also in:
Back to Top