ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి: పార్టీ నేతలతో సీఎం కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

TRS Party Meeting: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి: సీఎం కేసీఆర్‌

Published Tue, Aug 24 2021 5:17 PM

TRS State Committee Decisions Reveled By KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని.. దళిత బంధు అమలుపై పార్టీ శ్రేణులందరికీ అవగాహన కల్పించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) పార్టీ ప్రతినిధులకు చెప్పారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. 

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల పునర్నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు అమలులో పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. నవంబర్‌ మొదటివారంలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలని సమావేశంలో సీఎం కేసీఆర్‌ పార్టీ ప్రతినిధులకు ఆదేశించినట్లు తెలిసింది.

దేశ రాజధానిలో కేటాయించిన స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు సెప్టెంబర్‌ 2వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కొన్ని గంటల పాటు సాగిన సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు కేటీఆర్‌ తెలిపారు.

‘క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే జిల్లాల్లో పార్టీల కార్యాలయాల ప్రారంభోత్సవం అక్టోబర్‌లో చేసే అవకాశాలు ఉన్నాయి. ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేస్తాం. నవంబర్‌ మొదటివారంలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహణకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నెలాఖరులోపు సభ్యత్వం పూర్తి చేయాలి. సెప్టెంబర్‌ మొదటివారంలో గ్రామ కమిటీలు పూర్తి చేయాలి. సెప్టెంబర్‌ రెండోవారంలో మండల కమిటీలు, సెప్టెంబర్‌ మూడో వారంలో జిల్లా కమిటీలు పూర్తికి చర్యలు’ అని తెలిపారు.

చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’

పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయాలు ఇవి

  • 20 ఏళ్లుగా విజయవంతవంగా రెండు దశాబ్దాలు పార్టీని నడిపడంతో త్వరలోనే ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహణకు రాష్ట్ర కార్యవర్గం తీర్మానం.
  • హైదరాబాద్, వరంగల్ మినహా జిల్లాలోని పార్టీ కార్యాలయాలు దసరా తర్వాత అక్టోబర్‌లో ప్రారంభం.
  • ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల శంకుస్థాపన సీఎం కేసీఆర్ చేయనున్నారు.
  • సెప్టెంబర్‌ 2వ తేదీన 12,769 పార్టీ పంచాయతీ కమిటీల ప్రకటన.
  • మండల, మున్సిపల్, జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్‌లో ఏర్పాటు
  • సంస్థాగత నిర్మాణం మొత్తం సెప్టెంబర్‌లో పూర్తి చేయాలని తీర్మానం
  • కే కేశవరావు నేతృత్వంలో ఈ కమిటీలపై సంస్థాగత నిర్మాణం
  • ప్లీనరీ సమావేశం కరోనా పరిస్థితులు చూసుకొని నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించాలని యోచన.


చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్‌..

Advertisement
Advertisement