Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

Top 10 News Kalivi Kodi Rarest Bird In The World 21st November 2022 - Sakshi

1. వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 560 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. లంకమల అడివి కానరాని కలివి కోడి..  ట్విక్‌–టూ.. ట్విక్‌–టూ అరుపులేవి!
వైఎస్సార్‌ జిల్లాలో ఓ వైపు శేషాచలం.. మరోవైపు నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. అదే జిల్లాలోని సిద్ధవటం–బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఓ పక్షి ‘ట్విక్‌–టూ.. ట్విక్‌–టూ’ అని అరుస్తోంది. ఎంత అన్వేషించినా దాని జాడ మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో పెరిగే కలివి పొదల్లో నివసించే ఈ నిశాచర పక్షిని ‘కలివి కోడి’ అని పిలుస్తున్నారు.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్‌ ఎదుట సంతోష్‌ హాజరు లేనట్టే!
ఎమ్మెల్యేలకు ఎర కేసు­లో బీజేపీ జాతీయ ప్ర­ధా­న కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ ఇప్పట్లో హాజరయ్యే అ­వ­కా­శాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సిట్‌ గతంలో ఇచ్చిన నోటీసు మేరకు బీఎల్‌ సంతోష్‌ సోమవారం విచారణకు కావాల్సి ఉంది. 

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను?
బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ అద్దె బస్సులను కొనుక్కునే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3,100 అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు సొంతంగా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుతున్న విషయం తెలిసిందే.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా?
ఆది మానవుడు ఆహారాన్ని వండుకుని కాకుండా పచ్చిగానే తినేవాడని పుస్తకాల్లో చదువుకున్నాం. పచ్చిమాంసం, ఆకులు అలములు తిన్నట్లు కూడా చదువుకున్నాం. మానవుడు క్రమక్రమంగా పచ్చి ఆహారాన్ని కాకుండా వండుకుని తినడం నేర్చుకున్నాడు. అయితే, మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా?!  

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. గుజరాత్‌లో బీజేపీకి షాక్ తగులుతుందా?
గుజరాత్‌లో విద్యుత్‌ బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ప్రభుత్వం నాలుగు సార్లు చార్జీలను పరోక్ష పద్ధతిలో పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో నేరుగా గుజరాత్‌ ఎలక్ట్రిసిటీ కమిషన్‌ చార్జీల భారాన్ని మోపకుండా ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌ పర్‌చేజ్‌ ప్రైస్‌ అడ్జస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పీపీపీఏ) రూపంలో పెంచింది.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. అసలే డిజిటలైజేషన్‌ డేస్‌.. ఈ ఆదాయాలపై కూడా పన్ను చెల్లించడం ఉత్తమం!
జీతం మీద ఆదాయం పన్నుకి గురవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 17 (1) ప్రకారంజీతం అంటే ఏమిటో విశదీకరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో యజమాని నుండి ఒక ఉద్యోగి పుచ్చుకున్న మొత్తాన్ని జీతం అని అన్నా­రు. ఇంతటితో వదిలిపెట్టకుండా ఏయే అంశాలుంటాయో ఏకరువు పెట్టారు. 

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. హార్దిక్‌ ఆదేశించాడు.. అలా చేయమని!నేను పూర్తి చేశాను
టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇప్పడు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోను అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఆదివారం కివీస్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్‌ విధ్వంసం సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో సూర్య అద్భుతమైన శతకం సాధించాడు.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. 'వారిసు' చిత్ర వివాదం.. విజయ్‌ ఏం ప్రకటన చేయనున్నారు?
సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ తర్వాత ఆస్థాయిలో అభిమానులను కలిగిన నటుడు విజయ్‌. ఈయన తన అభిమాన సంఘాల ద్వారా తమిళ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌కి రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆసక్తి ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. 

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పూజలో పాల్గొనేందుకు గుమిగూడిన జనం.. ట్రక్కు దూసుకెళ్లి 12 మంది దుర్మరణం..
బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు గుమిగూడిన జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు.

పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top