నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. గుజరాత్‌లో బీజేపీకి షాక్ తగులుతుందా?

Gujarat Assembly Election 2022: What is the effect of electricity tariff - Sakshi

గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి విద్యుత్‌ షాక్‌ తగులుతుందా ? నానాటికీ పెరిగిపోతున్న చార్జీలు ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీస్తాయా ? సామాన్య జనమే కాదు. బడా బడా పారిశ్రామికవేత్తలు కూడా విద్యుత్‌ టారిఫ్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్‌ హామీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ?
 

గుజరాత్‌లో విద్యుత్‌ బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ప్రభుత్వం నాలుగు సార్లు చార్జీలను పరోక్ష పద్ధతిలో పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో నేరుగా గుజరాత్‌ ఎలక్ట్రిసిటీ కమిషన్‌ చార్జీల భారాన్ని మోపకుండా ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌ పర్‌చేజ్‌ ప్రైస్‌ అడ్జస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పీపీపీఏ) రూపంలో పెంచింది.  ప్రస్తుతం యూనిట్‌ ధర వివిధ వర్గాల వాడకానికి అనుగుణంగా యూనిట్‌కు రూ.2.50 నుంచి రూ. 7.50 వరకు ఉంది. . ‘‘గుజరాత్‌లో విద్యుత్‌ వినియోగదారులు 2021 మే–జూన్‌లో యూనిట్‌కి రూ.1.80 చెల్లిస్తే, ఈ ఏడాది జూన్‌ నాటికి యూనిట్‌ ధర రూ.2.50 చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏడాదిలో 70 పైసలు పెరిగింది.

గత రెండు నెలల్లోనే యూనిట్‌కు 30 పైసలు పెరిగేసరికి రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులపై నెలకి అదనంగా రూ.270 కోట్ల భారం పడింది’’ అని రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ నిపుణుడు కె.కె.బజాజ్‌ చెప్పారు. గుజరాత్‌లో విద్యుత్‌ వాడకం ఎక్కువ. ఒక వ్యక్తి ఏడాదికి సగటున 2,150 యూనిట్లు వాడితే, ఇతర రాష్ట్రాల్లో 1,150 యూనిట్లే వాడతారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా కోసం విద్యుత్‌ కంపెనీలు రూ.20 పెట్టి యూనిట్‌ కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా విద్యుత్‌ చార్జీలు వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపాయి. పారిశ్రామిక రంగానికి యూనిట్‌కు రూ.7.50 చెల్లించాల్సి రావడంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించకపోతే వ్యాపారాలు చేయలేమంటోంది సదరన్‌ గుజరాత్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ. మహారాష్ట్ర, తెలంగాణలో పరిశ్రమలు యూనిట్‌కు రూ.4 చెల్లిస్తే, తాము రూ.7.50 చెల్లించాల్సి వస్తోందన్న ఆందోళనలో వారు ఉన్నారు.  
 
ఆప్‌ వర్సెస్‌ బీజేపీ
గుజరాత్‌లో మొదటిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌ తరహాలో గృహాలకు నెలకి 300 యూనిట్‌ల వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ హామీ పట్ల సామాన్యులు ఆకర్షితులవుతున్నారు. 2021 డిసెంబర్‌ 31కి ముందు జారీ అయిన పెండింగ్‌ విద్యుత్‌ బకాయిల్ని మాఫీ చేస్తామని, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించింది. .మరోవైపు కాంగ్రెస్‌ కూడా ఉచిత విద్యుత్‌ హామీని అమలు చేస్తామంటోంది. ఇవన్నీ  అధికార పార్టీకి సవాల్‌గా మారాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచితాలు ఇచ్చే పార్టీల మాయలో పడొద్దని ఉచిత హామీ పథకాలు దేశాభివృద్ధిని అడ్డుకుంటాయంటూ ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌ హామీ నెరవేరాలంటే గుజరాత్‌ ఖజానాపై ఏడాదికి రూ.8,700 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇంత అదనపు భారాన్ని ఎలా మోస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్‌ అందించడంమే తమ పార్టీ లక్ష్యమనం మోదీ అంటున్నారు. విద్యుత్‌ చౌర్యం జరగకుండా మీటర్లు పెట్టడం తప్పనిసరి చేశారు. మరోవైపు బీజేపీ ప్రచారాన్ని ఆప్‌ తిప్పి కొడుతోంది. గుజరాత్‌లో ముఖ్యమంత్రి నెలకి 5 వేల యూనిట్లు, ఇతర మంత్రులకి 4 వేల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నప్పుడు సాధారణ జనం 300 యూనిట్ల వరకు ఎందుకు వాడుకోకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉచిత విద్యుత్‌ గుజరాత్‌ ఓటర్లకు కొత్త కాదు. 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేశూభాయ్‌ పటేల్‌ ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన కేశూభాయ్‌ పటేల్‌ రైతులకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం కింద 47 లక్షల ముంది లబ్ధి పొందుతారు. అయితే మోదీ ఛరిష్మాకు ఆయన ఎదురు నిలువ లేకపోయారు.అప్పట్లో ఉచిత విద్యుత్‌ హామీలేవీ ఫలించలేదు. ఇప్పుడు కూడా ఆప్, కాంగ్రెస్‌కు అదే జరుగుతుందని బీజేపీ ధీమాగా ఉంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-03-2023
Mar 20, 2023, 12:17 IST
సింహ రాశి (ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7) సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా...
05-12-2022
Dec 05, 2022, 17:07 IST
అప్‌డేట్స్‌ ముగిసిన రెండో దశ పోలింగ్‌.. 60శాతానికిపైగా ఓటింగ్ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తుది విడతలో...
04-12-2022
Dec 04, 2022, 05:47 IST
అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో, తుది దశ ప్రచారానికి శనివారం తెరపడింది. రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు...
03-12-2022
Dec 03, 2022, 05:41 IST
అహ్మదాబాద్‌: ‘‘ఆటంక్, లట్‌కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్‌ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని...
02-12-2022
Dec 02, 2022, 05:36 IST
గుజరాత్‌ మొదటి దశ పోలింగ్‌ ముగిసింది. రెండో దశలో ప్రచారం ఉధృతంగా సాగుతోంది.  గుజరాత్‌ మోడల్‌ పాలనతో సెంట్రల్‌ గుజరాత్‌...
01-12-2022
Dec 01, 2022, 05:14 IST
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల...
30-11-2022
Nov 30, 2022, 05:28 IST
గుజరాత్‌లో అధికార పీఠం కోసం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎడాపెడా హామీలతో ప్రచార పర్వాన్ని ఇప్పటికే రక్తి కట్టించాయి....
29-11-2022
Nov 29, 2022, 04:54 IST
ఆకాశంలో సగం అంటూ గొప్పగా కీర్తించడమే తప్ప రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడంలో మాత్రం పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. జనాభాలో...
28-11-2022
Nov 28, 2022, 06:14 IST
అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ...
28-11-2022
Nov 28, 2022, 06:10 IST
నెత్రంగోడా: కాంగ్రెస్‌ పార్టీకి గిరిజనులంటే ఏమాత్రం గౌరవం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సైతం...
28-11-2022
Nov 28, 2022, 05:28 IST
గుజరాత్‌ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. ర్యాలీలు, రోడ్‌ షోలు, బహిరంగ సభలతో ప్రధాని మోదీ,  ఆప్‌ నేత కేజ్రీవాల్‌ ప్రచారంలో దూసుకుపోతూంటే...
27-11-2022
Nov 27, 2022, 05:10 IST
గుజరాత్‌ అంటే మోదీ. మోదీ అంటే గుజరాత్‌. రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా ఇదే మాట వినిపిస్తోంది. ఆయన పేరే ఓ...
25-11-2022
Nov 25, 2022, 06:37 IST
ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా అందరి దృష్టి యువతపైనే. ప్రధాని మోదీకి యువతలో క్రేజ్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో...
25-11-2022
Nov 25, 2022, 05:23 IST
పాలన్‌పూర్‌/దేహ్‌గాం: గుజరాత్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. రాబోయే 25 ఏళ్లపాటు రాష్ట్ర భవిష్యత్తును తేల్చే ఎన్నికలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
24-11-2022
Nov 24, 2022, 06:14 IST
దాహోడ్‌/మెహసానా:  ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని...
22-11-2022
Nov 22, 2022, 06:00 IST
సురేంద్రనగర్‌:  కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు....
22-11-2022
Nov 22, 2022, 05:56 IST
మహువా: కాంగ్రెస్‌ నేత రాహల్‌ గాంధీ తొలిసారిగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో అడుగుపెట్టారు.  రాష్ట్ర అధికార బీజేపీపై...
22-11-2022
Nov 22, 2022, 05:49 IST
వారసత్వ రాజకీయాలు.. దేశాన్ని పట్టిపీడిస్తున్న జాడ్యమని కేవలం ప్రజాస్వామ్యవాదులే కాదు, సాక్షాత్తూ రాజకీయ పార్టీలు సైతం నిందిస్తుంటాయి. ఆచరణలో మాత్రం...
21-11-2022
Nov 21, 2022, 05:31 IST
వెరవాల్‌/ధొరాజి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ బీజేపీకే విజయం అందించాలని గుజరాత్‌ ప్రజలను ప్రధాని...
20-11-2022
Nov 20, 2022, 05:14 IST
సౌరాష్ట్ర.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. పటీదార్ల ఉద్యమానికి కేంద్ర బిందువు. ఈ ఉద్యమ ప్రభావంతో గత... 

Read also in:
Back to Top