Telugu Top News: ఈవెనింగ్‌ హైలైట్‌ న్యూస్‌

Top 10 News England Beat Team India By 10 Wickets 10th November 2022 - Sakshi

1. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వెంటే తాను ఉంటానని తుమ్మల స్పష్టం చేశారు. ములుగు జిల్లా వాజేడులో గురువారం ఆయన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: రామచంద్రభారతిపై ప్రశ్నల వర్షం.. కీలక స్టేట్‌మెంట్‌.. అందులో ఏముంది?
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజిలను రాజేంద్రనగర్ సీఎస్‌లో పోలీసులు విచారించారు. తొలి రోజు విచారణలో సుమారు 7 గంటల పాటు నిందితులను ప్రశ్నించారు. 

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ప్రమాణం చేయగలవా..? చంద్రబాబుకు కొడాలి నాని సవాల్‌
లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన వారిలో విజయసాయిరెడ్డి అల్లుడు లేరని.. అరబిందో సంస్థతో నీకు సంబంధం లేదని ప్రమాణం చేయగలవా..? అంటూ చంద్రబాబుకు మాజీ మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్‌
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా పలువురు సీనియర్‌ నాయకులు పోటీ విముఖత చూపారు. తాము పోటీ చేయడం లేదని, అభ్యర్థుల ఎంపికలో తమ పేర్లు పరిశీలించొద్దని అధిష్టానానికి తెలిపారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. గొప్ప మనసు చాటుకున్న లాలూ కూతురు.. తండ్రికి కిడ్నీ దానం చేయాలని నిర్ణయం
బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె గొప్ప మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కొత్త జీవితం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అన్నంత పనిచేస్తున్న పుతిన్‌... చిన్నారులకు సైతం సైనిక శిక్షణ
ఉక్రెయిన్‌పై గెలుపు కోసం పుతిన్‌ పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు లక్షల మందికి పైగా సైనికులను సైతం రిక్రూట్‌ చేసుకుంది రష్యా. ఇప్పుడూ ఏకంగా చిన్నారులకు పాఠశాల స్థాయి నుంచి సైనిక శిక్షణ ఇవ్వమంటూ ఆదేశాలు జారీ చేసింది రష్యా.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Ind Vs Eng: టీమిండియా ఓటమి.. ఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్‌
టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో టీమిండియాను చూడాలనుకున్న అభిమానుల ఆశ నెరవేరలేదు. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడ్డ రోహిత్‌ సేన 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమి.. కన్నీరు పెట్టుకున్న రోహిత్‌ శర్మ
ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో  టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు మాత్రం తీవ్ర నిరాశపరిశారు.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఐటీలో ఫేక్‌ కలకలం.. యాక్సెంచర్‌ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం న‌కిలీ ప‌త్రాలు, ఫేక్ ఎక్స్‌పీరియ‌న్స్ లెట‌ర్స్‌ అంశం ఐటీలో కలకలం రేపుతోంది.

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా?
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హోమ్లీ బ్యూటీగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. తెలుగులో దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన నటించింది. 

👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top