చీమూ నెత్తురుంటే బకాయిలు తెండి

Telangana: Minister Harish Rao Fires On BJP Leaders - Sakshi

బీజేపీ నేతలపై మంత్రి హరీశ్‌ ఫైర్‌

బిల్లులు రాలేదని దొంగ డ్రామాలు చేస్తున్నారు

పల్లె, పట్టణ ప్రగతి కోసం ఎనిమిదేళ్లలో రూ.11,711 కోట్లు వ్యయం

‘విభజన’ హామీలు నెరవేర్చని కేంద్రం

నారాయణపేట: ‘తెలంగాణలోని గ్రామపం చాయతీలకు కేంద్రం నుంచి రూ.1,100 కోట్లు రావాల్సి ఉంది. ఆర్థిక సంఘం నుంచి జీఎస్టీ రూపంలో రూ.11 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. బీజేపీ నేతలకు చీము, నెత్తురూ ఉంటే ఈ బకాయిలన్నీ తీసుకురావాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. సోమవారం నారాయణ పేటలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డితో కలిసి జిల్లా ఆస్పత్రిలో పలు యూనిట్లు ప్రారంభించడంతోపాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

అనంతరం అప్పక్‌ పల్లి వద్ద బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లా డారు. పల్లె, పట్టణ ప్రగతి కోసం ఈ ఎనిమి దేళ్లలో రూ.11,711 కోట్లు వెచ్చించా మని, గత రెండేళ్లలో రూ.1,144 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వాస్తవాలు ఇలా వుంటే బిల్లులు రాలేదని నలుగురు బీజేపీ సర్పంచ్‌ లను వెంట బెట్టుకుని ఆ పార్టీ నేతలు దొంగ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.

కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ ఎనిమిదేళ్లు అయినా విభ జన చట్టంలోని హామీలను నెరవేర్చలేద న్నా రు. కర్ణాటకలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు, ఏపీ లో పోలవరం, మధ్య ప్రదేశ్‌లో మరో ప్రాజె క్టుకు జాతీయ హోదా ఇచ్చారంటూ.. పాల మూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకి వ్వడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు. 

బీజేపీ ఫెయిల్‌..టీఆర్‌ఎస్‌ పాస్‌: ‘రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో లేవు. అధి కారంలోకి రావు. వారు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. వారి మాటలు నమ్మొద్దు..’ అం టూ మంత్రి హరీశ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ల్లో అమలు కాని పథకాలు ఇక్కడ ఎలా అవుతాయని ప్రశ్నించారు. రైతు బంధు, రైతుబీమా,  24 గంటల ఉచిత విద్యుత్‌ వం టివి ఆ రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అని నిలదీ శారు.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఇప్ప టికే 40 లక్షల ‘ఆసరా’ పింఛన్లు ఇస్తున్నామని, త్వర లోనే 57 ఏళ్ల వయస్సు వారు పది లక్షల మం దికి అందించనున్నామని తెలిపారు. ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి టీఆర్‌ఎస్‌ ఇక్కడ పాసైతే, కర్ణాటకలో బీజేపీ ఫెయిలైందని హరీశ్‌ ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి కులపిచ్చి, బీజేపీ నేత బండి సంజయ్‌కి మతపిచ్చి పట్టిం దని శ్రీనివాస్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కులం ఓట్లతోనే రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీ అయ్యారా? అని ప్రశ్నించారు. కార్యక్ర మాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top