బీజేపీని అప్రదిష్టపాల్జేసే ప్రయత్నం  

Telangana: BJP Leaders Denied Over SIT Notice To Srinivas - Sakshi

శ్రీనివాస్‌కు నోటీసులపై నేతల ఖండన 

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తికి సిట్‌ నోటీసులు జారీ చేయడాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమదేవి, సీహెచ్‌ విఠల్‌ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. సిట్‌ కాదు.. సిల్లీ దర్యాప్తు ఇదని, ఎవరికో నోటీసులిస్తే బండి సంజయ్‌కు ఏం సంబంధమని అరుణ ప్రశ్నించారు.

కేసీఆర్‌ బంధువులు చేసే తప్పులన్నింటికీ ఆయనే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీని అప్రదిష్ట పాల్జేసేందుకు కేసీఆర్‌ ఆడుతున్న దొంగ నాటకం ఇదని మండిపడ్దారు. ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే (దొంగే దొంగ) అన్నట్లుగా కేసీఆర్‌ సిట్‌ యవ్వారం ఉందని సోయం బాపూరావు విమర్శించారు. లిక్కర్‌ కేసులో బిడ్డ నిందితురాలు కాదని చూపించుకోవడం కోసం కేసీఆర్‌ ఆడుతున్న డ్రామాలో భాగమే ఇదని రాణి రుద్రమ ఆరోపించారు. హైకోర్ట్‌ సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో జరగాల్సిన సిట్‌ దర్యాప్తు దారి తప్పుతోందని విఠల్‌ విమర్శించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top