అమిత్‌ షాను కలుస్తా: శరద్‌ పవార్‌

Sharad Pawar Says Will Meet Amit Shah To Discuss BSF Row - Sakshi

ముంబై: బీఎస్‌ఎఫ్‌ వివాదాస్పద ఆదేశంపై కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అవుతానని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించారు. అసోం, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని భారత భూభాగాలలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) కార్యాచరణ అధికార పరిధిని పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన తాజా ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి.

ఈ నేపథ్యంలో అమిత్‌ షాను కలవనున్నట్టు పవార్‌ తెలిపారు. ‘హోం మంత్రి అమిత్ షాను కలవబోతున్నాను. దాని గురించి ఆయన ఆలోచనలను తెలుసుకుంటాను’ అని పవార్‌ పేర్కొన్నట్టు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం అంతర్జాతీయ సరిహద్దు నుండి పై మూడు రాష్ట్రాల్లో 50 కిలోమీటర్ల వరకు పనిచేసేందుకు బీఎస్‌ఎఫ్‌కు అధికారాలు కల్పించబడతాయి. ఇంతకుముందు ఈ పరిధి కేవలం 15 కిలోమీటర్ల వరకే ఉండేది. 

కొత్త ఆర్డర్ వివాదాస్పదంగా ఉందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులతో సమానంగా బీఎస్‌ఎఫ్‌ అధికారాలు ఇచ్చేలా ఉన్న ఈ ఆదేశాలు అమల్లోకి వస్తే తమ హక్కులకు భంగం కలిగే అవకాశముందన్న వాదనలు విన్పిస్తున్నాయి. కేంద్రం ఆదేశాలను పశ్చిమ బెంగాల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే తీవ్రవాదం, సరిహద్దు చొరబాటు నేరాలను అదుపు చేయడానికి కొత్త ఆర్డర్ ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో అమిత్‌ షాతో శరద్‌ పవార్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: కాంగ్రెస్‌ జోరు పెంచనుందా..? సీడబ్ల్యూసీ కీలక నిర్ణయాలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top