‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?’ | Sake Sailajanath Fires On Chandrababu Diversionary Politics | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?’

Apr 24 2026 1:56 PM | Updated on Apr 24 2026 3:48 PM

Sake Sailajanath Fires On Chandrababu Diversionary Politics

సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?.. ప్రజల కష్టాలు, రైతుల కన్నీళ్లు మీకు కనపడవా?’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొక్కజొన్న, ధాన్యం, పత్తి, మిర్చి.. ఇలా ఏది చూసినా గిట్టుబాటు ధరల్లేవు. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా?. డబుల్ ఇంజిన్‌ సర్కార్ అని చెప్పుకునే నేతలు కేంద్రం నుండి ఏం సహాయం పొందారు?’’ అంటూ శైలజానాథ్‌ నిలదీశారు.

‘‘ప్రజా సమస్యలు పక్కన పెట్టి, తిరుమల లడ్డూపై సంవత్సరన్నర పాటు అనవసర వివాదం చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యూషన్ కూడా సరిగా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వక విద్యాసంస్థలు పిల్లలను వేధిస్తున్నాయి. హాస్టళ్ల దుస్థితి, నిరుద్యోగుల సమస్యలు, శాంతి భద్రతలకు విఘాతం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్యతో జనం అల్లాడి పోతున్నారు. కానీ ప్రభుత్వానికి ఇవేమీ కనపడటం లేదు’’ అంటూ సాకే శైలజానాథ్‌ దుయ్యబట్టారు.

‘‘ప్రజా సమస్యలు, దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. ప్రజల ఆస్తుల్ని దోచుకోవటమే సంపద సృష్టా?. మావిగన్ ప్రతిపాదనకు సమాధానం చెప్పకుండా దూషణలు ఎందుకు?. రాయలసీమలో రైతులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. కానీ అమరావతిలో నీటిని తోడటానికే కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బు రాయలసీమలో ఖర్చు పెడితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. కానీ చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలోనే పెట్టటం అన్యాయం. అమరావతి అప్పులు రాయలసీమ వాసుల మీద పడుతున్నాయి. రాష్ట్రంలో యధేచ్చగా భూదోపిడీ జరుగుతోంది. దేవాదాయ భూములను కూడా పరిశ్రమలకు ఎలా ఇస్తారు?’’ అంటూ శైలజానాథ్‌ ప్రశ్నించారు.

నీ డప్పు ఆపు... ప్రజల కష్టాల వైపు కొంచెం చూడు...

Advertisement
 
Advertisement
Advertisement