
సాక్షి, అమరావతి: తనపై పవన్ కల్యాణ్ విష ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ‘సీఎం అభ్యర్థి ఎవరనేది ముందు క్లారిటీకి రండి. విడివిడిగా వచ్చినా, కలిసొచ్చిన మాకు ఒకే. పవన్ రోల్ ఏంటో అందరికీ తెలుసు’’ అని సజ్జల అన్నారు.
సబ్‌ప్లాన్ దుర్వినియోగం ఆరోపణలపై పవన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా?. చంద్రబాబు రిమోట్ నొక్కితే పవన్ మాట్లాడుతారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో డొల్ల కాబట్టే ప్రచారం ఎక్కువ చేసుకున్నారని సజ్జల మండిపడ్డారు.
చదవండి: తెలంగాణలో బలమెంత?.. పవన్ ప్రకటనలు వింటే ఏమనిపిస్తుందంటే..